రూట్ మార్చిన పవన్! స్లో అండ్ స్టడీ స్పీచ్!

సహజంగా జనసేనాని( Janasenani ) ప్రసంగాలు అంటేనే ఉవ్వెత్తున ఎగసిపడే ఉత్సాహం, నెత్తురు ఎగచిమ్మే ఆవేశం కలిసికట్టుగా కనబడుతుంది .

ముఖ్యంగా యువతను ఉద్దేశించి అత్యంత ఆవేశపూరితంగా ప్రసంగాలు చేసే పవన్( Pawan ) అధికారపక్షంపై మాటల తూటాలు పేలుస్తుంటారు ముఖ్యమంత్రి జగన్ ( jagan )ను ఉద్దేశించి ఏకవచనంతో కూడా సంబోధించిన స్పీచ్ లు మనం చూసాం.

అయితే మచిలీపట్నం( Machilipatnam ) సభలో మాత్రం అధ్యంతం పవన్ పరిణితితో కూడిన రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చారు.నిజానికి వారాహి మొదటి విడత యాత్రలో కూడా పవన్ జనసేన రాజ్యం వస్తే ప్రజలకు జరగబోయే మంచిని, తామందించబోయే అద్భుతమైన పాలనను వివరిస్తూ అనేక సామాజిక వర్గాల పెద్దలతో ముఖాముఖీ లు పెట్టుకుని వివరిస్తూ ఒక క్రమ పద్ధతిలో ప్రసంగించేవారు.

అయితే వారాహి 2 నుంచి రూటు మార్చిన జనసేనా ని హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

దాంతో అధికార పక్షం నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ లు రావడంతో తరువాత నుండీ ఇక ప్రసంగాల తీరు మారిపోయింది.మీరు ఒకటంటే నేను నాలుగు అంటా అన్నట్టుగా అధికారి పక్షంతో మాటల యుద్ధం మొదలుపెట్టిన పవన్, వైసీపీ అధినేత జగన్ ( YCP chief Jagan )ను ఉద్దేశించి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు .వాలంటీర్ వ్యవస్థ( Volunteer system ) పై మరియు సచివాలయ వ్యవస్థ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత పార్టీకి కూడా నష్టం కలిగించే విధంగా వెళ్ళాయి .అయితే ప్రస్తుతం సున్నితమైన రాజకీయ వాతావరణం ఉన్నందున రెచ్చగొట్టే ప్రసంగాల కన్నా ఆలోచనాత్మక ప్రసంగాల అవసరం ఉందని గ్రహించిన పవన్ మరోసారి స్లో అండ్ స్టడీగా తన స్పీచ్ను డెలివర్ చేశారు.

Advertisement

రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా హైలెట్ చేసిన పవన్ ,తమ ప్రభుత్వం వస్తే ఆయా వర్గాలకు ఏమాత్రం మేలు జరుగుతుందో చెప్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా సమాజంలో అనేక వర్గాలు ప్రభుత్వ విధానాల వల్ల పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు వివరించిన పవన్ ఆలోచించి ఓటు వేయవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు.ఇలా ఆవేశంకన్నా ఆలోచన ముఖ్యమని పవన్ గ్రహించడం ఒక రాజకీయ పార్టీ అధినేతగా పార్టీకి మేలు చేస్తుందిఅని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు .

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు