పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”( Brow the Avatar ).ఈ జులై లోనే రాబోతున్న ఈ మెగా మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా వాయిదా పడుతుంది అని పలు రూమర్స్ వైరల్ అయ్యాయి.బ్రో సినిమా వాయిదా పడింది అని ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టమే అని.ఇంకా పెండింగ్ పనులు చాలానే ఉండడంతో ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేస్తున్నారు అని రూమర్స్ వచ్చాయి.
కానీ ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తాజాగా మేకర్స్ మరోసారి నిరూపించారు.ఎందుకంటే తాజాగా మేకర్స్ అఫిషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో మరో పది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని చెబుతూ ఇదే విషయాన్నీ సరికొత్త పోస్టర్ తో తెలిపారు.
ఈ పోస్టర్ లో పవర్ స్టార్ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
కళ్లద్దాలు పెట్టుకుని కారు విండో లో నుండి బయటకు చూస్తున్న ఈయన ముందు ఉండగా సాయి తేజ్( Sai Tej ) వెనుక కనిపిస్తున్నాడు.ఇక ఈ పోస్టర్ తో మేకర్స్ వాయిదా రూమర్స్ కు చెక్ పెట్టారు.ఇదిలా ఉండగా జులై 21న ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది అని నిర్మాత తెలిపాడు.
దీంతో వరుస ప్రమోషన్స్ కు మేకర్స్ ఫుల్ సిద్ధం అయినట్టే తెలుస్తుంది.ఇక సముద్రఖని( samudrakhani ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
కాగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.