చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మిత బాషా స్వభావం ఉన్నవాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే.చిరంజీవి కూడా ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్నీ తెలియచేసాడు.
అసలు ఆయన సినిమాల్లోకి హీరో అవ్వడమే పెద్ద వింత అని ఎన్నో సార్లు తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి.మా వదిన వల్ల బలవంతంగా హీరోని అయ్యాను కానీ, ఇంత భయం,సిగ్గు ఉన్న నేను కెమెరా ని ఫేస్ చేసి ఇన్ని సినిమాలు చెయ్యడం, అలాగే రాజకీయాల్లోకి అడుగుపెట్టి లక్షలాది మంది మధ్యలో నిల్చొని ధైర్యం గా మాట్లాడగలగడం ఇవన్నీ నేను కలలో కూడా ఊహించలేదు.
ఎదో చిన్నగా పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుదామని అనుకున్నాను అంటూ ఎన్నో పొలిటికల్ మీటింగ్స్ లో చెప్పుకొచ్చేవాడు.ఇక షూటింగ్స్ సమయం లో అయితే హీరోయిన్స్ తో అసలు మాట్లాడేవాడు కాదు.
తన పని ఎదో తాను చేసుకొని వెళ్లిపోయేవాడు.

అయితే సీనియర్ హీరోయిన్ యమున ( Yamuna )పవన్ కళ్యాణ్ తో తనకి ఎదురైనా ఒక సంఘటన గురించి రీసెంట్ జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ ‘ఒక రోజు చిరంజీవి ( Chiranjeevi )గారి ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసాను.అప్పటికి ఆయన ఇంకా ఇండస్ట్రీ లోకి ఇంకా అడుగుపెట్టలేదు.
హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు అనుకుంట.కేవలం చిరంజీవి గారితో మాట్లాడడానికి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారితో ఏకాంతంగా 30 నిముషాలు మాట్లాడే అవకాశం వచ్చింది.
ఆయన ఎంత మర్యాద పూర్వకంగా మాట్లాడాడో ఇప్పటి వరకు నేను మర్చిపోలేకపోతున్నాను, అదొక మెమరీ గా నిలిచిపోయింది.అంత నెమ్మదిగా ఉండే పవన్ కళ్యాణ్ నేడు రాజకీయాల్లో అంత పవర్ ఫుల్ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు.
ఆయన స్వభావం అప్పట్లో కూడా అలాగే ఉండేదేమో, నేను గమనించలేదు ‘అంటూ చెప్పుకొచ్చింది యమున.

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా గొప్పగా రాణించిన యమున ఇప్పుడు టీవీ సీరియల్స్ ( TV serials )లో నటిస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది.ప్రస్తుతం ఆమె ఈటీవీ లో ప్రసారమయ్యే మౌన పోరాటం సీరియల్ లో మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది.ఇక సినిమాల్లో అయితే ఈమె చివరిసారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘టాక్సీ వాలా’.
విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించిన యమున, మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.ఎక్కువగా టీవీ సీరియల్స్ వైపే ఈమె మొగ్గు చూపిస్తుంది.
కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం , కన్నడం మారియు మలయాళం భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరీర్ ని కొనసాగిస్తుంది .