టీడీపీ- వైసీపీలు కలిసి జనసేనని డామేజ్ చేస్తున్నాయి! పవన్ కళ్యాణ్ వాఖ్యలు!

ఏపీ రాజకీయాలలో రెండు పార్టీల ఆధిపత్యంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే ఎ పార్టీని అయిన తొక్కేసే ప్రయత్నం చేస్తూ వుంటారు.

ఏపీలో మొదటి నుంచి రెండు కులాల ఆధిపత్యం నడుస్తుంది.

ఇలాంటి రాజకీయాల వలెనే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో తప్పని సరి పరిస్థితిలో విలీనం చేయాల్సి వచ్చింది.ఇప్పుడు మరోసారి తెలుగుదేశం, వైసీపీ పార్టీలు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపైన అలాంటి కుట్ర రాజకీయాలని మొదలెట్టింది.

తమ రాజకీయ లబ్ది కోసం, ప్రజలని తప్పుదోవ పట్టించడానికి చానల్స్, పత్రికలని ఉపయోగించుకొని తప్పుడు ప్రచారాలకి తెరతీసాయి.టీడీపీ పార్టీ వారు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి ఉన్నపళంగా ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే విధంగా తమ నాయకులతో జనాల్లోకి న్యూస్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసింది.

టీడీపీ చేసిన ఈ అసత్య ప్రచారాన్ని జనసేనాని తిప్పికొట్టారు.ఓ వైపు పవన్ కళ్యాణ్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే మరో వైపు జనసేన వైసీపీతో పొత్తు పెట్టుకుంటుంది అనే ప్రచారాన్ని ముమ్మరం చేసారు.

Advertisement

అలాగే వైసీపీ పార్టీ వారు కూడా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అని, ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది అంటూ తన పత్రికలో ఓ తప్పుడు వార్తని ముద్రించి, చానల్ లో ప్రచారం చేసింది.ఈ నేపధ్యంలో టీడీపీ, వైసీపీ కుట్ర రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో విమర్శలు చేసారు.

ఈ రెండు పార్టీలు జనసేనని తక్కువ చేసి చూపించడం ద్వారా ప్రజలలో తమ పార్టీపై అనుమానం పెరిగేలా చేస్తున్నాయని, తమ సొంత చానల్స్, పత్రికలలో విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.అయితే జనసేన ఇప్పుడు ఓ చిన్న శక్తే కావచ్చు.

కాని రెండు పార్టీలని బలంగా ఎదుర్కొనే శక్తి అవుతుంది అని వాఖ్యలు చేసారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు