పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం పలు సినిమా ల్లో నటిస్తున్నాడు.అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ).
ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన షూటింగ్ ను చకచక చేస్తున్నారు.
రేపు సినిమా యొక్క గ్లిమ్స్ ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.అందుకు గాను ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట.

పవన్ సినిమా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ కోసం ఇప్పటి నుండే ఈవెంట్స్ అవసరం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా లు ముందు ముందు చాలానే రాబోతున్నాయి.కనుక వాటికి సంబంధించిన ఈవెంట్స్ కూడా భారీ ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయి.అలాంటిది ఇప్పుడే గ్లిమ్స్ విడుదల కోసం కూడా ఇలా ఈవెంట్స్ అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే పవన్ అభిమానులు మాత్రం ఆయన సినిమా యొక్క ఈవెంట్ అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా గబ్బర్ సింగ్ ( Gabbar Singh )యొక్క జోడీ కనుక కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఉస్తాద్ భగత్ సింగ్ ను తమిళం లో సూపర్ హిట్ అయిన ఒక సినిమా కు రీమేక్ అన్నట్లుగా రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది లో సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు హరీష్ శంకర్ ( Directed Harish Shankar )చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.







