పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagath Singh ). ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు.
మాస్ ఆడియెన్స్ ను మెప్పించే హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో పాటు ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ రావడం కూడా ఈ కాంబోపై అంచనాలు పెంచేసాయి.

ఇటీవలే ఈ సినిమా షూట్ స్టార్ట్ కాగా కొత్త షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.ఈ షూట్ గురించి తాజాగా హరీష్ శంకర్( Director Harish Shankar ) అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఇటీవలే స్టార్ట్ చేసిన షూట్ ముగిసింది అని సినిమాకే అత్యంత కీలకమైన ఇంటెన్స్ పార్ట్ ను కంప్లీట్ చేశామని ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు అంటూ ఈయన కొత్త అప్డేట్ ఇచ్చాడు.
ఈ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు.పవన్ రాజకీయాల్లో( Pawan Kalyan Politics ) బిజీగా ఉంటూనే ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు.
మరి అనుకున్న దాని కంటే ఫాస్ట్ గానే ఫినిష్ చేస్తున్న ఈ సినిమా మరో షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela )తో పాటు సాక్షి వైద్య కూడా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మరి ఈ కాంబో గబ్బర్ సింగ్ వంటి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.







