సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Kaaram ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
![Telugu Guntur Kaaram, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan, Sreeleela, Trivikr Telugu Guntur Kaaram, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan, Sreeleela, Trivikr](https://telugustop.com/wp-content/uploads/2023/11/Guntur-Kaaram-Mahesh-Babu-Trivikram-Meenakshi-Chaudhary.jpg)
ఇప్పటికే ఇది పాన్ ఇండియన్ కాకపోయినా భారీ బిజినెస్ చేసుకుని రీజనల్ సినిమాల్లోనే రికార్డులను క్రియేట్ చేసుకుంటూ పోతుంది.దీంతో ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవ్వకుండా చూసుకోవాలని టీమ్ అంత చాలా కష్ట పడుతున్నారు.మరి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా వీటిని డబల్ చేసేందుకు మరింతగా ప్లాన్ చేస్తున్నాడుఈ సినిమా కోసం పవర్ స్టార్ ను త్రివిక్రమ్ ( Trivikram )రంగంలోకి దింపనున్నాడు అని టాక్.
ముందు నుండి ఈ సినిమాలో పవర్ స్టార్ నటించ బోతున్నట్టు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ తెలుస్తుంది.పవర్ స్టార్ అయితే ఈ సినిమాలో ఎలాంటి గెస్ట్ రోల్ చేయడం లేదట…
![Telugu Guntur Kaaram, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan, Sreeleela, Trivikr Telugu Guntur Kaaram, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan, Sreeleela, Trivikr](https://telugustop.com/wp-content/uploads/2023/11/Pawan-Kalyan-Pawan-Kalyan-voice-over-Jagapathi-babu-Guntur-Kaaram-Mahesh-Babu-Trivikram-SreeLeela-Meenakshi-Chaudhary.jpg)
కానీ త్రివిక్రమ్, మహేష్ కోసం తన వాయిస్ ను వినిపించనున్నారట.ఈ సినిమాలో మహేష్ ఎంట్రీ సీన్ లోనే కాకుండా పలు కీలక సన్నివేశాల్లో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చారని ఆ సీన్స్ లో ఆయన వాయిస్ తో గూస్ బంప్స్ రావడం ఖాయం అని తెలుస్తుంది.మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.మరి ఈ సూపర్ హిట్ ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( SreeLeela Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.