కేవలం సాయి తేజ్ కేరీర్ కోసం పవన్ కళ్యాణ్ కమిట్మెంట్.. ఇండస్ట్రీలో గుసగుసలు నిజమేనా?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఇంత బిజీ బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే.అయితే పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో మనకు తెలిసిందే.

 Pawan Kalyan To Act With Sai Dharam Tej Vinodhaya Sitham Remake,pawan Kalyan,sai Dharam Tej,vinodhaya Sitham Remake,janasena,politics,bhavadeeyudu Bhagat Singh-TeluguStop.com

అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇతర పార్టీలు ఇప్పటికే పనులను స్పీడ్ అప్ చేయగా జనసేన పార్టీ మాత్రం ఇంకా పనులను మొదలుపెట్టలేదు.ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అ దిశగా ఆలోచన చేస్తున్నారు.

ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.అయితే సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి సంపూర్ణంగా రాజకీయాలలోకి వెళ్లాలి అని చూస్తున్నారు.

 Pawan Kalyan To Act With Sai Dharam Tej Vinodhaya Sitham Remake,Pawan Kalyan,Sai Dharam Tej,Vinodhaya Sitham Remake,Janasena,Politics,Bhavadeeyudu Bhagat Singh-కేవలం సాయి తేజ్ కేరీర్ కోసం పవన్ కళ్యాణ్ కమిట్మెంట్.. ఇండస్ట్రీలో గుసగుసలు నిజమేనా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళ సినిమా అయిన వినోదయా సిద్ధం సినిమాను రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే మొదట ఇది వార్త లాగే భావించినప్పటికీ ఆ తరువాత నెమ్మదిగా ఈ ప్రాజెక్టును సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ నటించబోతున్న భగవద్వీడు భగత్ సినిమాను పక్కనపెట్టి ఈ సినిమాకు డేట్లు కేటాయించడంతో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది అన్ని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలోనే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇదే విషయంపై వెబ్ మీడియా స్పందిస్తూ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కోసమే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కమిటీ అయ్యాడా? సాయి ధరమ్ తేజ్ కు బూస్ట్ ని ఇవ్వడం కోసం తెరను పంచుకుంటున్నాడా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.కానీ తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.వినోదయ సిద్ధం సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 12 నుంచి 15 రోజులు మాత్రమే డేట్లను ఇచ్చారట.తరువాత సినిమా అంతా కూడా మేనల్లుడు పైనే ఉంటుందట.

అయితే రెండు వారాల షెడ్యూల్ అంతే పవన్ కళ్యాణ్ కి పెద్ద విషయం ఏమీ కాదు.ఆడుతూ పాడుతూ షూటింగ్ కి హాజరై సినిమాను ముగించవచ్చు.

అదే భగవద్వీడు భగత్ సింగ్ సినిమాకు అయితే కొన్ని నెలలు డేట్స్ కేటాయించాల్సి ఉండటంతో పాటు ఆ సినిమాను రిలీజ్ చేయడానికి చాలా సమయం పడుతుందట.దీనితో అభిమానులకు బాగా గ్యాప్ ఇచ్చినట్లు అవుతుందని ఇవన్నీ ఆలోచించి రాజకీయ ప్రచారంలో బిజీ అయ్యే ముందు రెండు సినిమాలు చేసి వస్తే అభిమానులు ఫుల్ ఖుషి అవుతారు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube