టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్( Re Release Trend ) ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పోకిరి సినిమా నుండి ప్రారంభమైన ఈ రిలీజ్ హవా, రాను రాను స్టార్ హీరోల కొత్త సినిమా విడుదల రేంజ్ హంగామా కి చేరుకుంది.
ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో ఇప్పుడు అందరికంటే టాప్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు( Pawan Kalyan Movies ) ఉన్నాయి.ఆయన హీరో గా నటించిన ‘జల్సా’ కేవలం ఒక్క రోజు మాత్రమే స్పెషల్ షోస్ గా ప్రదర్శించారు.
ఈ షోస్ కి ఎవ్వరును ఊహించని విధంగా 3 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘ఖుషి’ ( Kushi Re Release Collections )చిత్రాన్ని గత ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.ఈ సినిమాకి మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఫుల్ రన్ లో 7 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.అయితే ఈ ఏడాది మే 20 వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు( Junior NTR ) సందర్భంగా సింహాద్రి చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యగా, అది జల్సా వసూళ్లను దాటి నాలుగు కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 గా నిల్చింది కానీ, పవన్ కళ్యాణ్ ఖుషి రికార్డ్స్ ని మాత్రం బద్దలు కొట్టలేకపోయింది.

అయితే ఈ నెల 30 వ తారీఖున పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిల్చిన ‘తొలిప్రేమ'( Tholiprema ) చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ ని కూడా నిన్ననే విడుదల చేసారు.ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి డైరెక్టర్ కరుణాకరన్, నిర్మాత GVG రాజు, దిల్ రాజు మరియు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తదితరులు హాజరయ్యారు.ఈ చిత్రం తో తమకి ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్రసంగాలు సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారాయి.

అయితే ఈ చిత్రానికి వచ్చే వసూళ్లు జనసేన పార్టీ( Janasena Party Funds ) కి ఫండ్ రూపం లో వెళ్ళదు కనుక మనం ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఒక నిర్ణయం తీసుకున్నారు.కానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శ్రీ మాత క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు, కలెక్షన్స్ నుండి వచ్చిన కొంత లాభాన్ని జనసేన పార్టీ కి డొనేట్ చేస్తామని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళు చెప్పే మాటలు నమ్మక్కర్లేదని, సినిమాకి కలెక్షన్స్ కోసం ఇలా చెప్తారు కానీ, చివరి నిమిషం లో ఇవ్వరూ అంటూ కామెంట్స్ చేసారు.అలా ఈ సినిమాకి పెద్దగా ఫ్యాన్స్ నుండి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం తో కలెక్షన్స్ రావని అనుకున్నారు కానీ, హైదరాబాద్ లో నిన్న రాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా, అవన్నీ సోల్డ్ అయిపోయాయి.
దీనిని బట్టీ ఈ చిత్రానికి కూడా మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.చూడాలి మరి ఈ చిత్రం కలెక్షన్స్ లో ఖుషి ని దాటుతుందా లేదా అనేది.







