పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీద ఉంది.కొన్నాళ్లుగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.17వ శతాబ్ధం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ తో పాటుగా నిధి అగర్వాల్, జాక్వెలిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పవర్ స్టార్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది.
ఇక సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్ అంతకుముందు ప్రేక్షకులను అలరించగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న వీరమల్లు స్పెషల్ టీజర్ రాబోతుందని తెలుస్తుంది.
హరి హర వీరమల్లు సినిమా నుంచి రాబోతున్న ఈ టీజర్ మరింత క్రేజీగా ఉండబోతుందని అర్ధమవుతుంది.సో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ స్పెషల్ టీజర్ స్పెషల్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు.హరి హర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.2023 సమ్మర్ లో ఈ రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు.ఇదే కాదు పవన్ దీనితో పాటుగా మరో 3 సినిమాలు లైన్ లో పెట్టారు.







