పవన్ మౌనం టీడీపీ కి వరంగా మారిందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వైకిరి ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని పవన్ చూస్తున్నారు.

 Pawan Kalyan Silence Has Become A Boon For Tdp? Janasena, Pavan Kalyan, Ysrcp, A-TeluguStop.com

కానీ ఆ దిశగా అయితే ఆయన అడుగులు పడడం లేదనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా పొత్తుల విషయంలో పవన్ వైఖరి ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడంలేదు.

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూస్తాను అంటూ ప్రకటించిన పవన్ పై టీడీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది.జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే తిరుగుండదని, వైసీపీని అధికారానికి దూరం చేయవచ్చు అనే లెక్కలు వేసుకుంటోంది.

ఇక బీజేపీ కూడా జనసేన తో పొత్తు కొనసాగుతుందని, ఇందులో సందేహమే లేదు అని పదే పదే చెబుతోంది.

Telugu Ap, Chandrababu, Janasena, Machilipatnam, Pavan Kalyan, Varahi, Ysrcp-Tel

కానీ పొత్తుల విషయంలో పవన్ ఇంకా ఏ క్లారిటీ తో ఉన్నారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.పవన్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది జనసేన నాయకులకు,కాపు సామాజిక వర్గం వారికి కూడా అంతుపట్టడం లేదు.2024 ఎన్నికల్లో పవన్ ఖచ్చితంగా సత్తా చాటుతారని,సీఎం కూర్చీలో కూర్చుంటారని కాపు సామజిక వర్గం గంపెడు ఆశలు పెట్టుకుంది.కానీ పవన్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.పొత్తుల విషయంలో కానీ,రాజకీయం గా ముందుకు వెళ్లే విషయంలో కానీ, పవన్ సైరైనా క్లారిటీతో లేకపోవడంతో, ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నాయకులు కూడా ఆలోచనలో పడినట్టుగా కనిపిస్తున్నారు.

ఇటీవలే టీడీపీ లో చేరిన మాజీ మంత్రి ,ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మొదటగా జనసేన లో చేరాలని చూసారు.కానీ జనసేన నుంచి సరైన స్పందన కనిపించకపోవడంతో, చివరి నిముషంలో టీడీపీ లో చేరిపోయారు.

Telugu Ap, Chandrababu, Janasena, Machilipatnam, Pavan Kalyan, Varahi, Ysrcp-Tel

అలాగే టీడీపీ నుంచి జనసేన లో చేరాలని చుసిన కాపు సామాజికవర్గం కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా టీడీపీలో నే ఉంటాను అంటూ లోకేష్ పాదయాత్రలో పాల్గొని మరీ క్లారిటీ ఇచ్చారు.ఇదే విధంగా ఎంతోమంది జనసేనలో చేరాలనుకున్న నాయకులు డైలమాలో ఉన్నారు.దీంతో పవన్ రాజకీయంగా ముందుకు వెళ్లే విషయంలోనూ,పొత్తుల విషయంలో ఈ నెల 14 వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభలో ఏదైనా క్లారిటీ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ జనసేన వర్గాల్లో నెలకొంది.ప్రస్తుతం పవన్ మౌనంగా ఉండడంతో జనసేన లో చేరాలనుకున్న నాయకులకు టీడీపీ గేలం వేస్తూ.

జనసేన కు భారీగా నష్టాన్ని కలిగిస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube