తొలిప్రేమ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి ( Keerthi Reddy ) జంటగా నటించిన చిత్రం తొలిప్రేమ( Tholiprema ) .కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ క్లాసిక్ లవ్ స్టోరీ ఇప్పటికీ ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చెప్పాలి.

 Pawan Kalyan Tholi Prema Movie Remuneration,pawan Kalyan,keerthi Reddy,tholiprem-TeluguStop.com

ఇలా ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలను పూర్తి చేసుకోవడంతో తాజాగా ఈ చిత్రాన్ని తిరిగి విడుదల చేయాలని నిర్మాతలు భావించారు ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇలా ఈ సినిమా తిరిగి విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

Telugu Keerthi Reddy, Pawan Kalyan, Gvg Raju, Tholiprema-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత జివిజి రాజు మాట్లాడుతూ.ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు మరి తొలిప్రేమ సినిమా కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకున్నారనే విషయానికి వస్తే.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ లక్షలు తీసుకున్నారని నిర్మాత జివిజి రాజు( Producer GVG Raju ) తెలియజేశారు.

అయితే ఎన్ని లక్షలు ఇచ్చాము అనే విషయాన్ని తాను చెప్పనని తెలిపారు.

Telugu Keerthi Reddy, Pawan Kalyan, Gvg Raju, Tholiprema-Movie

సినిమా ఓకే అయిన తర్వాత నేను ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వగలనని చెప్పాను.అందుకు పవన్ కళ్యాణ్ ఓకే అని చెప్పారు.అయితే సినిమా పూర్తయిన తర్వాత ఇవ్వాలా అని అడగడంతో మీ ఇష్టం ఎప్పుడైనా ఇవ్వండి అని చెప్పారు.

అందుకే ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చాను సినిమా పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పగా పవన్ కళ్యాణ్ నెల కొంచెం నా ఖర్చులకు ఇవ్వమని చెప్పి అడిగి తీసుకున్నారని అలాగే సినిమా విడుదలైన తర్వాత రెండు రోజులకు మిగిలిన రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చామని ఈ సందర్భంగా జీవిజి రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube