ఏమిటి ఈ పైత్యం పవన్ కళ్యాణ్?

హీరోలు రెండు రకాలు .కొత్త కథతో సినిమా తీసేవాళ్ళు, వేరే భాషలో సినిమాని తీసుకొచ్చి రీమేక్ చేసేవాళ్ళు .

ఇన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ అంతా రెండోరకం హీరో అని అనుకునేవాళ్ళంతా .కాని పవన్ కళ్యాణ్ మూడోరకం.అల్రేడి తెలుగులోకి డబ్ అయిన పరభాష సినిమాలని రీమేక్ చేస్తాడు.

ఇప్పుడొస్తున్న కాటమరాయుడు అజిత్ నటించిన వీరమ్ కి రీమేక్.విషయం ఏమిటంటే ఈ సినిమా తెలుగులోకి "వీరుడొక్కడే" పేరుతో డబ్ అయ్యింది.

అల్రెడి తెలుగులోకి వచ్చిన సినిమానే తిరిగి పవన్ రిమేక్ చేసాడు.ఇక పవన్ కళ్యాణ్ కొత్తగా సైన్ చేసిన సినిమా మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణంలో, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుంది అని మీకు తెలుసు.

Advertisement

విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా కూడా తెలుగులో డబ్ అయిన సినిమాకి రీమేకే.విజయ్ - సమంత నటించిన "తెరి" ని పవన్ రీమేక్ చేస్తున్నట్లు ఓ సీనీపెద్ద క్లూ ఇచ్చేశారు.

ఈ తెరి తెలుగులోకి పోలీసోడు పేరుతో డబ్ అయ్యింది.ఆ సినిమాని ఎవరో చిన్న నిర్మాత కాదు, దిల్ రాజు పంపిణి చేసారు.

ఇలా అల్రెడి డబ్ అయిన సినిమాలని రీమేక్ చేస్తూ పోవడం ఏంటో ! కుదిరితే తన సినిమాని మళ్ళీ తానే రీమేక్ చేసుకునేలా ఉన్నాడుగా పవర్ స్టార్.చేసినా చేస్తాడు.

పవన్ కళ్యాణ్ అన్నట్లుగా, ఆయనకున్న తిక్క అలాంటిది.కాని తిక్క వెనుక లెక్క ఎవరికి అర్థం కావడం లేదు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
లైగర్ ట్రైలర్ లో.. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువకుడు ఎవరో తెలుసా?

అయినా, ఇది తిక్క కాదు పైత్యం అని అభిప్రాయపడుతున్నారి సినీవిశ్లేషకులు.కేవలం సినీ విమర్శకులే కాదు, అభిమానులు కూడా పవర్ స్టార్ ని తిట్టుకుంటున్నారు .మాకు ఏంటి టార్చర్ అని వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు