జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనేక ప్రజా సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ అనేక ఉద్యమాలు చేపట్టారు.పవన్ ఉద్యమాల ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వం పై బాగానే పడింది.
అంతేకాదు, జనసేనకు రాజకీయంగా మంచి మైలేజీ తీసుకువచ్చాయి.ఇదిలా ఉంటే మరో సరికొత్త ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.
అది కూడా దేశ నాయకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి.ఇటీవల నేతాజీ పై రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు వెళ్ళన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి పవన్ ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా నేతాజీ విషయంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్ కు తీసుకు రాలేకపోతున్నానని ఈ సందర్భంగా పవన్ అసహనం వ్యక్తం చేశారు.నేతాజీ అస్థికలను తెచ్చి ఎర్రకోటలో ఉంచాలని పవన్ కోరుతున్నారు.
అంతేకాదు నేతాజీ అస్థికలను భారత్ తీసుకు వచ్చేత వరకు ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పవన్ కోరుతున్నారు.ఇది సాధ్యం కావాలంటే తప్పనిసరిగా నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని పవన్ కోరారు.
నేతాజీ అస్థికలను తేవాలని డిమాండ్ చేస్తూ, రింకోజ్ టూ రెడ్ పోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్ లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నేతాజీ సేవలను ఈ దేశం సరిగ్గా గుర్తించలేదని, నిన్నకాక మొన్న వచ్చిన వారికి విగ్రహాలు పెడుతున్నామని, కనీసం వంద రూపాయల నోటు పై అయినా నేతాజీ బొమ్మ ఉండేలా ముద్రించాలని పవన్ డిమాండ్ చేశారు.ప్రజలు కోరుకుంటే ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.మొత్తంగా సుభాష్ చంద్రబోస్ విషయంలో మరో ప్రజా ఉద్యమాన్ని చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.