పవన్ లుక్ ను చూసి టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్.. అలా కనిపించడంతో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పవన్ తో ఒక్క సినిమా అయినా నిర్మించాలని కోరుకుంటున్న నిర్మాతలు, పవన్ తో ఒక్క సినిమా అయినా తెరకెక్కించాలని కోరుకుంటున్న దర్శకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

 Pawan Kalyan New Look Negative Comments Details Here Goes Viral ,  Negative Comm-TeluguStop.com

పవన్ సైతం ఒకవైపు రాజకీయాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వరుస సినిమాలలో నటిస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ విశ్వక్ ఐశ్వర్య కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు.

అయితే పవన్ తాజా లుక్ ను చూసిన అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు.పవన్ బరువు పెరిగినట్టు క్లోజప్ లో ముఖం ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది.పవన్ కౌలు రైతుల భరోసా యాత్ర కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో ఫిట్ నెస్ పై పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.లుక్ విషయంలో పవన్ జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిదానంగా ఈ సినిమా షూట్ జరుగుతోంది.

ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందో కాదో చూడాల్సి ఉంది.ఇప్పటికే ఈ సినిమా షూట్ 60 శాతం పూర్తి కావడం గమనార్హం.పవన్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Pawan Kalyan, Pawankaulu, Trolls-Movie

మరోవైపు పవన్ కొత్త ప్రాజెక్ట్ ల షూటింగ్ సైతం త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది.వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాల షూటింగ్ లతో పవన్ బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.పవన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube