పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.ఆ సినిమా చాలా నెలల క్రితం ప్రారంభమైంది.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా ఆ సినిమా ఇంకా కూడా షూటింగ్ దశలోనే ఉంది.పవన్ కళ్యాణ్ మొదట ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇతర సినిమాల సంగతి పట్టించుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా చివరి దశకు రాకుండానే మరో సినిమా కు క్లాప్ కొట్టబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.సరే ఒక సినిమా కు క్లాప్ కొడితే పర్వాలేదు కానీ ఒకే సారి రెండు మూడు సినిమాలకు క్లాప్ కొట్టేలా ఉన్నారు.
మొన్నటి వరకు వినోదయ్య సిత్తం అనే తమిళ సినిమా రీమిక్స్ లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు ప్రచారం జరిగింది.ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెగ వార్తలు వచ్చాయి.
కానీ ఆ సినిమా మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇప్పుడు సాహో సుజిత్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందబోతున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ప్రచారం జరుగుతుంది.అది ఎంత వరకు నిజం అనే విషయమై క్లారిటీ లేదు.కానీ ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రారంభోత్సవం ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.
ఏది నిజం ఏది అబద్దం తెలియక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంత మంది జుట్టు పీక్కుంటున్నారు.పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నాడు, మరో వైపు ఇంత వరుసగా సినిమాలు ఎలా చేస్తాడు అనేది మరి కొందరి ప్రశ్న.







