పవన్ ఖుషి కూడా ఆ అరుదైన నెంబర్ ను చేరుకోలేక పోయింది

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్‌ నడుస్తోంది.పవన్ కళ్యాణ్ అభిమానులు వరుసగా ఆయన సూపర్ హిట్ సినిమాల యొక్క రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 Pawan Kalyan Kushi Movie Collections , Pawan Kalyan , Kushi Movie , Collections-TeluguStop.com

ఇప్పటికే జల్సా, ఖుషి సినిమాలను విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు బద్రి సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

జనవరి 26వ తారీఖున బద్రి సినిమా రీ రిలీజ్ జరగబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ మధ్య కాలం లో రీ రిలీజ్ అయిన సినిమాలు యొక్క కలెక్షన్స్ చూస్తూ ఉంటే మెల్ల మెల్లగా కోటి రూపాయలు క్రాస్ చేశాయి.

ఇప్పుడు అందరి దృష్టి రెండు కోట్ల కలెక్షన్స్ పై ఉంది.ఖుషి సినిమా ఖచ్చితంగా రెండు కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుందని ప్రతి ఒక్కరు చాలా ధీమా తో ఉన్నారు.

కానీ ఖుషి సినిమా కూడా రెండు కోట్ల కలెక్షన్స్ కి కాస్త దూరంగా ఉండి పోయింది.కోటి 80 లక్షల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా మళ్లీ కొన్నాళ్ల తర్వాత విడుదల అయినప్పుడు రెండు కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుందంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు సరికొత్త రికార్డు సృష్టించడం కోసం బద్రి సినిమా రెండు కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే విధంగా సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేయాలని నిర్ణయించారు.బద్రి సినిమా కు రెండు కోట్ల కలెక్షన్స్ నమోదయ్యేలా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్లాన్ చేస్తున్నారట.అది ఎంత వరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే క్రిష్‌ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఒకటి రెండు నెలల్లో ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది.కొత్తగా కమిట్‌ అయినా రెండు మూడు సినిమాల చిత్రీకరణ లో కూడా పవన్ కళ్యాణ్ వరుసగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌ నటించిన రెండు సినిమాలు అయినా రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube