బీజేపీ దెబ్బకు స్పీడ్ పెంచిన పవన్ ? ఇంచార్జీల నియామకం ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్టుగానే కనిపిస్తోంది.2024 ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన కూటమి ద్వారా ఎన్నికలకు వెళ్లి అధికారం దక్కించుకోవాలని పవన్ ఆశపడుతున్నారు.

ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదనే ఆలోచనతోనే బిజెపితో జత కలిశారు.

కేంద్ర అధికార పార్టీ బిజెపి అండదండలు ఉంటే, ఏపీలో మరింత బలోపేతం అవ్వొచ్చని, ఆర్థికంగా, రాజకీయంగా బిజెపి అండదండలు పుష్కలంగా అందుతాయి అని, ఇలా ఎన్నో ఆశలతో బీజేపీకి పవన్ దగ్గరయ్యారు.పవన్ కు ఆ మేరకు కేంద్ర బిజెపి పెద్దలు మొదట్లో ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో పెద్దగా షరతులు పెట్టకుండానే బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు.

కానీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి బిజెపి వైఖరి పవన్ కు అర్థంకాని పరిస్థితి.అసలు కేంద్ర బిజెపి పెద్దలెవరూ, ఇప్పటి వరకు పవన్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఏ విషయంలోనూ కలుపుకుని వెళ్లకపోవడం, ఏపీ బీజేపీ నాయకులు తమ దారి తాము అన్నట్లుగా ఒంటరిగానే పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ, మిత్రపక్షమైన జనసేనను పట్టించుకోకపోవడం వంటి ఎన్నో కారణాలతో చాలాకాలంగా బిజెపి అసంతృప్తితో ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి తప్ప పవన్ కు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఆ పార్టీతో పొత్తు తెగతెంపులు చేసుకుంటే, రాజకీయంగా పడే ఇబ్బందులు, వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పవన్ సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.కానీ తాను మొదటి నుంచి రాజకీయ బద్ధశత్రువుగా చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో, బీజేపీ ఇప్పుడు పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించడం, స్వయంగా జగన్ కు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం , కేంద్ర కేబినెట్లో వైసీపీకి మంత్రి పదవులు దక్కడం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటున్న పవన్ ఇక ముందు ముందు తమకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా బీజేపీ లేదు అనే అభిప్రాయానికి వచ్చినట్టు గా కనిపిస్తున్నారు.

Advertisement

ఈ మేరకు సొంతంగానే బలపడాలని, తాము సొంతంగా బలం పెంచుకుంటే, బిజెపి తమ ప్రాధాన్యం గుర్తిస్తుందని, 2024 ఎన్నికల్లో తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనలో మొత్తం 175 నియోజకవర్గాల్లో కొత్తగా నియోజకవర్గ ఇన్చార్జి లను నియమించి, మరింత గా జనసేనను యాక్టివ్ చేయాలని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.ఇక తమతో బిజెపి కలిసి వచ్చినా, రాకపోయినా సొంతంగానే కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లాలనే అభిప్రాయంలో ఉన్నారు.

మొదటి నుంచి జన సైనికులు సైతం బిజెపిని క్షేత్రస్థాయిలో కలుపుకుని వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, పై స్థాయిలో పొత్తు ఉన్నా, కింది స్థాయిలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉండటం వంటి పరిణామాలతో సొంతంగానే జనసేనను బలోపేతం చేయాలనే అభిప్రాయానికి పవన్ వచ్చేసినట్లుగా కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు