తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హోరెత్తుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణలో మరొక నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మహాకూటమికి అధికార టిఆర్ఎస్ పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
ఇక ఏపీలో మరో ఆరు నెలల్లో జరగనున్న ఎన్నికల పోరులో ఈసారి ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీ లకు గట్టిపోటీని ఇవ్వడానికి జనసేనాని జనసేన పార్టీ సిద్ధంగా ఉంది.అయితే ఈ మూడు పార్టీల ట్రయాంగిల్ పోరులో ఏ పార్టీకి ఆ పార్టీ తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది…అయితే

మొదటిసారి 2019 ఎన్నికలతో ప్రత్యక్ష పోరులోకి దిగుతున్న జనసేన పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని పాటు చేస్తుందా.?? అసలు జనసేన అధినేత వ్యూహం ఏమిటి.?? ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా పవన్ కళ్యాణ్ కి ఉందా.?? లేక ఎలాంటి వ్యూహాలను పవన్ అనుసరిస్తున్నారు…?? అనే వివరాలను ఒకసారి పరిశీలిస్తే.జనసేనాని వచ్చే ఎన్నికల్లో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి జనసేనాని ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి.వాటిలో ఒకటి పవన్ జనసేన తో పాటు మరొక పార్టీ ని కలుపుకొని ఎన్నికల్లో దిగి అత్యధిక సీట్లు గెలుచుకోవడం.

మరొకటి సొంతగా ఎన్నికల్లో పాల్గొని సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకుని, అధికారంలోకి వచ్చే పార్టీ కి మద్దతు ఇచ్చి జనసేన ఆశయాలను, ఆలోచనలను ఆ పార్టీ ద్వారా అమలయ్యేలా అధికారం చెలాయించడం…అయితే ఈ రెండు అంశాల్లో పవన్ కళ్యాణ్ రెండో మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు ఇప్పటికే అంచనాలు వేశారు.అంతేకాదు ఇదే పవన్ కళ్యాణ్ ముందున్న ఏకైక మార్గమని, పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని మొగ్గుచూపుతున్నారని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉందని తెలుపుతున్నారు.

జనసేనాని ఈ మార్గం ద్వారానే తనదైన పాలనను ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించవచ్చునని, ముఖ్యంగా టిడిపిని ఆ వచ్చే ఎన్నికల్లోగా భూస్థాపితం చేయడానికి, తానొక ప్రత్యామ్నాయ శక్తిగా ఏపీ లో ఎదగడానికి ఈ మార్గం ఉపయోగపడుతుందని పవన్ ఒక క్లారిటీకి వచ్చేశారట.అయితే దాదాపు 40 సీట్లు గెలుచుకుంటే గాని ఇది సాధ్యం కాదని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే తప్పకుండా 40 స్థానాలు గెలిచి తీరాల్సిందేనని పవన్ కీలక నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని తెలుస్తోంది.అంతేకాదు అందుకు తగ్గట్టుగా వ్యుహాలని సైతం సిద్దం చేయాలనీ పార్టీ కీలక నేతలకి ఆదేశాలు జారీ చేశారట.మరి జనసేనాని వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలాల్సిందే.