Pawan Kalyan : ఇద్దరి ఫ్రెండ్స్ ను కలుపుతూ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్…

పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇటు సినిమాలను, అటు పాలిటిక్స్ ను రెండింటిని ఏకతాటిపై బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Pawan Kalyan Is Making A Film Combining Two Friends Trivikram Bandla Ganesh-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు అయిన త్రివిక్రమ్( Trivikram ) ఆయనతో సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటున్నాడు.

అలాగే ఆయన ఎలాంటి సినిమాలు చేయాలో కూడా డిసైడ్ చేసి పెడుతున్నాడు.

 Pawan Kalyan Is Making A Film Combining Two Friends Trivikram Bandla Ganesh-Paw-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు.కాబట్టి ఆయనకి భారీ సినిమాలు చేసే టైం లేదు కాబట్టి తొందరగా అయిపోయే చిన్న కాన్సెప్ట్ లతో ఉండే సినిమాలని, వేరే భాషల నుంచి రీమేక్ చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు.

అందులో భాగంగానే వరుస సినిమాలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.

Telugu Bandla Ganesh, Pawan Kalyan, Pawankalyan, Tollywood, Trivikram, Trivikram

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి మంచి మిత్రుడుగా ఉన్న బండ్ల గణేష్( Bandla Ganesh ) తనకంటూ ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ ప్రతి ఈవెంట్లో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఆయన అభిమానులను సంతోష పెడుతూ ఉంటాడు.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా బండ్ల గణేష్ తో గబ్బర్ సింగ్( Gabbar Singh ) అనే సినిమా చేసి ఆయన్ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చాడు.

Telugu Bandla Ganesh, Pawan Kalyan, Pawankalyan, Tollywood, Trivikram, Trivikram

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కి బండ్ల గణేష్ కి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి.ఎందుకు అంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ను దూరం పెట్టమని చెప్పాడని అందువల్లే పవన్ కళ్యాణ్ ఆయన్ని దూరం పెడుతున్నాడనే వార్తలు అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి.కానీ వీటిలో ఎంతమాత్రం నిజం లేదనే విషయం అయితే ఇప్పుడు తెలుస్తుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ తర్వాత చేయబోయే సినిమాకి బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా ఉండబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube