బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమిట్లలో వైసీపీ ( YCP )నిర్వహించిన ‘సిద్ధం’ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) అన్నారు.సిద్ధం సభ విజయవంతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకి కన్ను కుట్టిందన్నారు.
జనం లేని పార్టీకి సేనాని పవన్ కల్యాణ్ అని విమర్శించారు.సిద్ధాంతం లేని పార్టీలు అన్నీ ఒక్కటయ్యాయన్నారు.
గతంలో పోలిస్తే వైసీపీ బలం ఇంకా పెరిగిందన్న మంత్రి కాకాణి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.







