పవన్ అతనికి ఛాన్స్ ఇస్తాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూటే సపరేటు.కెరీర్ ఆరంభం నుంచే దర్శకుడి పేరు కన్నా, దర్శకుడి సత్తాని నమ్మకోని అవకాశాలు ఇచ్చారు ఆయన.

 Pawan Kalyan In Johnny Master Direction ?-TeluguStop.com

తోలిసారి దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ అయితేనేమి, కొత్తవాడు కరుణాకరన్ అయితేనేమో, పెద్దగా అనుభవం లేని ఎస్.జే సూర్య అయితేనేమి, పవన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.అందరు భారి బ్లాక్బస్టర్స్ ఇచ్చి కృతజ్ఞత చాటుకున్నారు.

ఇక ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న గాస్సిప్ ఏమిటంటే, పవన్ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నాడు.అతను ఎవరో కాదు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్.రామ్ చరణ్ కు చాలా సన్నిహితుడు జాని.

ఇటివలే పవన్ ను కలిసి ఒక లైన్ వినిపించాడని, అది పవన్ కి నచ్చింది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దీనిలో ఎంతవరకు నిజం దాగుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ఇక పవర్ స్టార్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు.వచ్చే వారం నుంచి హైదరాబాద్ లో జరిగే కొత్త షెడ్యుల్ లో కాజల్ తో కలిసి ఒక పాట వేసుకోనున్నారని సమాచారం.

బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే రెండోవ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube