సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే 100% షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇది ఇలా ఉంటే ఇటీవల ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఈ టీజర్ విడుదల అయిన తరువాత ఈ సినిమా పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగుతోంది.
కాగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పుష్ప 2 లో మెరవబోతున్నాడు.ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే.పుష్ప 2 లో పవన్ కళ్యాణ్ మెరవబోతున్నాడు.
కాకపోతే నటుడుగా కాదు తన మాటల్ని అందించబోతున్నాడు.బన్నీ ఇంట్రడక్షన్ కి సంబంధించి పవన్ వాయిస్ ఓవర్ ని( Pawan Voice Over ) ఇవ్వబోతున్నాడు.
అంటే పుష్ప గురించి పవన్ చెప్పనున్నాడు.కాకపోతే పుష్ప టీం ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించలేదు.కానీ సోషల్ మీడియాలో ఇది నిజం అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.చిత్ర యూనిట్ కావాలనే ఈ విషయాన్నీ సీక్రెట్ గా ఉంచుతుందని అంటున్నారు.ఆల్రెడీ పవన్ తన డబ్బింగ్ ని కూడా కంప్లీట్ చేసాడనే వార్త కూడా వస్తుంది.ఇప్పడు ఈ న్యూస్ బన్నీ అండ్ పవన్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తోంది.
ఈ వార్తలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.