హరిహర కాకుండానే పవన్‌ అది మొదలు పెట్టాడు ఏంటి?

పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాలేదు.

ఎప్పుడెప్పుడు ఆ సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తాడా అంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దర్శకుడు క్రిష్ దాదాపు రెండు సంవత్సరాలుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు.ఆయన నుండి మరిన్ని సినిమాలు రావాలని కోరుకునే వారు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు వెంటనే పూర్తి అవ్వాలని ఆశ పడుతున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రారంభం అయినా ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.వరుసగా రెండవ రోజు ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లోనే పవన్ కళ్యాణ్ పాల్గొంటూ ఉన్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ ఒక వైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయకుండానే మరో వైపు ఆ సినిమా ను మొదలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో కేవలం రెండున్నర నెలలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారట.

Advertisement

తమిళ సూపర్ హిట్ సినిమాకి ఈ సినిమా రీమేక్.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ చాలా స్పీడ్ గా జరగబోతుందని హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు ఈ సినిమా ను విడుదల చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది.హరిహర వీరమల్లు లో పవన్ కళ్యాణ్ విభిన్నమైన గెటప్ తో కనిపించబోతున్నాడు.

కనుక ఆ సినిమా కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆరాట పడుతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు