జనసేన పార్టీ కి మహిళల్లో ఇంత ఆదరణ మార్పుకి సంకేతమా..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు( AP Politics ) ప్రస్తుతం ఎంత వాడివేడిగా సాగుతుందో మన అందరికీ తెలిసిందే.నిన్న మొన్నటి వరకు ఒక లెక్క, పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర'( Varahi Vijaya Yatra ) తర్వాత మరో లెక్క లాగ అయిపోయింది మన రాష్ట్ర రాజకీయాల పరిస్థితి.

 Pawan Kalyan Great Gesture Towards Woman,pawan Kalyan,old Woman,women,janasena M-TeluguStop.com

పవన్ కళ్యాణ్ సభలకు జనాలు పోటెత్తడం కొత్తేమి కాదు, కానీ ఈసారి ఆయనకీ అడుగడుగునా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు పలికిన నీరాజనం ని చూసి ప్రత్యర్థుల పార్టీలకు వెన్నులో వణుకు పుట్టింది.అంతే కాదు వారాహి యాత్రలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాట్లాడిన మాట్లాడిన మాటలు , ప్రూఫ్స్ తో సహా బయటకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టిన తీరు ప్రతీ ఒక్కరికీ ఎంతో బాగా నచ్చింది.

ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ( Voulnteer System )ని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేసింద.ఇక పోతే పవన్ కళ్యాణ్ సభలకు యూత్ మరియు మాస్ రావడం సర్వ సాధారణం.

Telugu Ap, Janasena, Pawan Kalyan, Ycp-Politics

కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా మహిళలు మరియు వృద్దులు కూడా హాజరు అవుతున్నారు, అడుగడుగునా ఆయనకీ హారతులు పడుతూ, 2019 సంవత్సరం కంటే కూడా పదింతలు ఎక్కువ గా పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కి హాజరు అవుతున్నారు.ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని పరిణామం ,రాజకీయ విశ్లేషకులు సైతం దీనికి ఆశ్చర్యపోతున్నారు.ఎన్నికల ఫలితాలలో భవిష్యత్తుని నిర్ణయించేది ఆడవాళ్ళ ఓట్లే.వాళ్ళు ఊహించని రీతిలో పోలింగ్ బూత్స్ వద్దకి వచ్చి ఓట్లు వేశారు అంటే కచ్చితంగా అధికారం లో మార్పులు వచ్చినట్టే.

ఈసారి జనసేన( Janasena ) విషయం లో కూడా మహిళా ఓటు బ్యాంక్ కీలకం కాబోతుందా అనేది రాజకీయ నాయకులూ విశ్లేషిస్తున్నారు.ఒకవేళ అదే కనుక నిజమైతే రాబోయే ఎన్నికలలో ఎలాంటి పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ గెలిచేయొచ్చు అని అంటున్నారు.‘వారాహి విజయ యాత్ర’ టూర్ అన్నీ ఫేస్ లు పూర్తి అయితే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

Telugu Ap, Janasena, Pawan Kalyan, Ycp-Politics

ఇక ఇప్పటికే రెండు విడతల ‘వారాహి విజయ యాత్ర’ పూర్తి అవ్వగా, మూడవ విడత కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియచేయనున్నారు జనసేన పార్టీ నాయకులు.ఆగష్టు మొదటి వారం లో మూడవ విడత కి సంబంధించిన యాత్ర ప్రారంభం కానుంది.ఇకపోతే రీసెంట్ గా జనసేన పార్టీ లోకి వైసీపీ నాయకులు( YCP Leaders ) క్యూ కడుతూ జాయిన్ అవుతుండడం కార్యకర్తల్లో మంచి జోష్ ని నింపింది.

ఇక రాబొయ్యే రోజుల్లో ఇంకెంత మంది లీడర్స్ వచ్చి జాయిన్ అవుతారు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube