పవన్ నమ్మితే అస్సలు వదలడుగా.. ఆ దర్శకునికి మరో ఛాన్స్ ఇస్తున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరుంది.కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సహాయం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Gave One More Chance To Samudrakhani Details, Pawan Kalyan,samudrak-TeluguStop.com

పవన్ సముద్రఖని కాంబినేషన్ లో బ్రో మూవీ( BRO Movie ) తెరకెక్కుతోంది.ఈ సినిమాలో పవన్ పాత్ర నిడివి తక్కువైనా పవన్ స్ట్రెయిట్ సినిమాలకు ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో ఈ సినిమాకు కూడా అదే స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

అయితే సముద్రఖనికి పవన్ కళ్యాణ్ మరో ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.సముద్రఖని వర్కింగ్ స్టైల్ నచ్చడంతో మరో ఛాన్స్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని సమాచారం.

పవన్ కెరీర్ లో అత్యంత వేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాగా బ్రో నిలిచింది.సీరియళ్లు తీసిన అనుభవం ఉండటంతో సముద్రఖని సూపర్ ఫాస్ట్ స్పీడ్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

Telugu Bro, Pawan Kalyan, Pawankalyan, Samudrakhani, Tollywood-Movie

అయితే సముద్రఖని ( samudrakhani )సొంత కథతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలుస్తోంది.పవన్ నమ్మితే అస్సలు వదలడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సముద్రఖని సమాజానికి సందేశం ఇచ్చే కథలతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.పవన్ సముద్రఖనికి ఛాన్స్ ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రోజుకు 2 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎన్నికలకు ముందే మూడు సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారని బోగట్టా.

హరిహర వీరమల్లు మినహా పవన్ సినిమాలన్నీ ఎన్నికలకు ముందే పూర్తయ్యే ఛాన్స్ అయితే ఉంది.వీరమల్లు షూట్ మాత్రం అంతకంతకూ ఆలస్యమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube