జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పటి వరకూ చేపట్టిన ప్రజా పోరాట యాత్రకి త్వరలో బ్రేక్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇక నుంచీ ప్రజా సమస్యలకోసం మాత్రమే కాదు నియోజకవర్గ స్థాయిలో ఉండే సమస్యలపై జనసేనాని దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
అయితే ఒక్క సారిగా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి.?? ఎవరి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.?? అనే వివరాలలోకి వెళ్తే…సార్వత్రిక ఎన్నికలకి ఎంతో సమయం లేకపోవడంతో పవన్ తన వ్యుహాలని మార్చుకున్నాడు.ప్రజా పోరాట యాత్రలు ఇలాగే కొనసాగిస్తూ వెళ్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన పవన్, పార్టీలో కీలక నేతలతో భేటీ అయ్యారట.
ఇప్పటి వరకూ పోరాట యాత్రలు చేస్తూ వెళ్తున్నాం, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

ఇప్పటి వరకూ నియోజక వర్గ స్థాయిలో జనసేన పార్టీ దృష్టి పెట్టింది తక్కువే అందుకే నియోజకవర్గాల స్థాయిలో జిల్లా పర్యటనలు చేద్దాం అని తెలిపారట.అంతేకాదు.వీలు కుదిరినప్పుడల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటే బాగుంటుందని అనే విషయంపై సుదీర్ఘ చర్చలు జరిపారట.
ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ ఈ నెల 13వ తేదీన తెనాలికి రానున్నారు.నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగే భోగి పండుగ కార్యక్రమంలో పాల్గొని అక్కడే ఏర్పాటు చేస్తున్న రైతులు ,మహిళలు యువతతో భేటీ అవుతారని తెలుస్తోంది.

ముఖ్యంగా తెనాలి పర్యటనలో రైతు సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.కాగా నాదెండ్ల మనోహర్ సూచన మేరకే పవన్ కళ్యాణ్ తన వ్యుహాలని మార్చుకున్నట్లుగా వినికిడి.కేవలం పోరాట యాత్రల్లో మీరు ఉండిపోతే నియోజక వర్గాల వారిగా ఉండే జనసేన అనుకూల వ్యక్తులని ఉశ్చాహ పరిచేది ఎప్పుడు.?? ప్రజలలోకి పార్టీని తీసుకు వెళ్ళేది ఎప్పుడు అంటూ పవన్ కి సూచించారట నాదెండ్ల దాంతో పవన్ కళ్యాణ్ ఒక్క సారిగా పోరాట యాత్రాలని పక్కన పెట్టి నాదెండ్ల సూచనతో జిల్లా పర్యటనలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

అయితే ఈ జిల్లా పర్యటనలలో నియోజకవర్గాల వారిగా పర్యటనలకి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్దం అయ్యిందట.అంతేకాదు.జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలు , అలాగే నియోజకవర్గాల వారీగా ఉండే సమస్యలని ఇప్పటికే పవన్ టేబుల్ మీద ఉన్నాయని తెలుస్తోంది.ఏది ఏమైనా సరే టీడీపీ ని మరో మారు ఉతికి ఆరేయడానికి పవన్ సిద్దమవుతూనే పార్టీని బలోపేతం చేసుకోవడానికి వ్యూహాలు చేస్తున్నాడు అంటున్నారు విశ్లేషకులు.







