పవన్‌ తో ఇంకా మొదలు పెట్టకుండానే అప్పుడే అక్కడి వరకు వెళ్లిన దర్శకుడు

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా హరీష్ శంకర్ ( Harish Shankar )దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కోసం ఉస్తాద్‌ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh )అనే టైటిల్ని కూడా ఖరారు చేయడం జరిగింది.

 Pawan Kalyan Director Harish Shankar Want To Do Film Ravi Teja , Pawan Kalyan ,h-TeluguStop.com

వచ్చే నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఒక భారీ సెట్టింగ్ నిర్మాణం ఈ సినిమా కోసం జరుగుతోందట, పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మూడవ వారం లేదా నాలుగో వారంలో చిత్రీకరణలో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.10 నుండి 12 రోజుల పాటు మొదటి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడట.పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనడానికి ముందే ఆయన లేని సన్నివేశాలను దర్శకుడు హరిష్‌ శంకర్ పూర్తి చేయబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది.

ఒక వైపు పవన్ కళ్యాణ్ సినిమా కోసం భారీగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ మరో వైపు మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) హీరోగా ఒక సినిమా ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

Telugu Harish Shankar, Pawan Kalyan, Ravi Teja, Telugu, Ustad Bhagath-Movie

ఇటీవల రవితేజ ను కలిసి స్టోరీ లైన్ కూడా చెప్పాడని సమాచారం అందుతుంది.వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి.అందులో మిరపకాయ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

కనుక మరో విజయం వీరిద్దరి కాంబినేషన్ లో రావడం ఖాయం.కనుక వెంటనే వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదే సమయం లో పవన్ కళ్యాణ్ తో సినిమా పూర్తి కాకుండానే రవితేజ తో సినిమా ను మొదలు పెట్టేందుకు సిద్ధమవడం పై దర్శకుడు హరీష్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమా చేస్తున్నప్పుడు ఇతర హీరోలతో సినిమా గురించి ఆలోచన అవసరం లేదు అనేది వారి అభిప్రాయం.

పవన్ కళ్యాణ్ తో హరిష్‌ శంకర్ సినిమా అనుకుని దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.అయినా ఇప్పటి వరకు కనీసం షూటింగ్ ప్రారంభం కాలేదు.

అందుకే ఇతర హీరోల వెనుక పడడంలో తప్పేం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube