Renu Desai Aadhya: ఆ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్న ఆధ్య… నాన్సెన్స్ అంటూ రేణు దేశాయ్ రియాక్ట్!

పవన్ కళ్యాణ్ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి రేణు దేశాయ్(Renu Desai) పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో కలిసి రెండు సినిమాలలో నటించారు.

అయితే వీరిద్దరూ కలిసే నటించడం బద్రి సినిమాలోనే ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది.

ఇలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన పిల్లల బాధ్యతలను చేపట్టారు.

ఇలా ఇన్ని రోజులు పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రేణు దేశాయ్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసింది.తాజాగా ఈమె రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswararao) సినిమా ద్వారా ముందుకు వచ్చారు ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడిచేస్తోంది.

ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం( Hemalatha Lavanam ) అనే పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రేణు దేశాయ్ తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

ఇక రేణు దేశాయ్ కి ఎప్పుడూ కూడా తన పిల్లల సినీ ఎంట్రీ గురించి ఎన్నో రకాల ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కుమారుడిని ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈమెను ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ ఉంటారు.అయితే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధోరణి కారణంగా ఈమె ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాలి.

అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన కుమారుడు అకీరా (Akira) ఎంట్రీ గురించి మాట్లాడుతూ అందరి మాదిరిగానే నా కొడుకుని నేను కూడా స్క్రీన్ పై చూసుకోవాలని కోరిక నాకు చాలా ఉంది కాకపోతే నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అఖిరాను ఏ మాత్రం బలవంతం చేయను అంటూ చెప్పుకొచ్చారు.

తనకు ఇష్టం వచ్చిన రంగంలో తనని వెళ్ళనిస్తానని తాను ఎక్కడికి వెళ్లినా తాను ప్రోత్సహిస్తాను అంటూ ఈమె చెప్పుకొచ్చారు.అయితే కుమారుడు సినిమా ఇండస్ట్రీలోకి తప్పకుండా వస్తారన్న ధీమా నెలలో ఉంది అయితే తమ కూతురు కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని ఇప్పటికే ఒక పాన్ ఇండియా సినిమాలో( Pan India Movie ) నటించబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వార్తలపై స్పందిస్తూ ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.మెగా కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంతమంది వచ్చినా ఫ్యాన్స్ ఆహ్వానిస్తారు కానీ హీరోయిన్స్ గా వస్తే మాత్రం వారిని సక్సెస్ కానివ్వరు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆధ్యా (Aadya) కూడా పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించినటువంటి రేణు దేశాయ్ ఆధ్యకు చిన్నప్పటినుంచి సినిమాలు అంటే ఏమాత్రం ఆసక్తి లేదని తెలియజేశారు.ఆద్యకి ఆర్కిటెక్ట్( Architect ) అవ్వాలని కోరిక అంటూ చెప్పింది.చిన్నప్పుడు నుంచి అదే ఆలోచనతో ఉంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

త్వరలో కాలేజీలో కూడా జాయిన్ కాబోతున్నట్లు ఈమె తెలిపారు.ఇలా రేణు దేశాయ్ కుమార్తె ఇండస్ట్రీలోకి రాదు అంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చేశారు.

Advertisement

తాజా వార్తలు