ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది పరిస్థితులు మారిపోతున్నాయి.ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల హామీలు ప్రకటిస్తున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది.
తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలసి పోటీ చేయబోతున్నాయి.ఈ రెండు పార్టీలతో బీజేపీ( BJP ) కూడా కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో 2014 ఎన్నికల మాదిరిగా.టీడీపీ బీజేపీ జనసేన …కూటమి ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారం విషయంలో దూకుడుగా ఉన్నారు.
![Telugu Ap, Bhimavaram, Cm Ys Jagan, Corrupt, Janasena, Pawan Kalyan, Ysrcp-Lates Telugu Ap, Bhimavaram, Cm Ys Jagan, Corrupt, Janasena, Pawan Kalyan, Ysrcp-Lates](https://telugustop.com/wp-content/uploads/2024/02/Pawan-Kalyan-YSRCP-ap-politics-Bhimavaram.jpg)
ఇటీవల ఫిబ్రవరి 14వ తారీకు భీమవరం( Bhimavaram ) నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావించగా.హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతి రాలేదు.దీంతో మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలోనే భీమవరం మిగతా కొన్నిచోట్ల జరగాల్సిన సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరోపక్క వైసీపీ “సిద్ధం” సభలు నిర్వహిస్తూ ఎన్నికలకు రెడీ అవుతోంది.ఇప్పటికే ఉత్తరాంధ్రకి సంబంధించి భీమిలిలో, కోస్తా ప్రాంతానికి సంబంధించి దెందులూరులో “సిద్ధం” సభలు నిర్వహించారు.
పరిస్థితి ఇలా ఉండగా వైసీపీ( YCP )పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మైనింగ్, మద్యం, అక్రమార్జన సొమ్ముతో వైసీపీ ఎన్నికలకు రెడీ అవుతుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తున్నారు.అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు.
దీనిపై అధికారులు కూడా మౌనంగా ఉండటం బాధాకరం.వైసీపీ ప్రజాక్షేమాన్ని విస్మరించింది వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టండి.
అని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.