ప్రస్తుతం రాజకీయాల్లో వైసీపీ జనసేన పార్టీల మద్య రాజకీయ రగడ తారస్థాయికి చేరుతోంది.ఈ మద్య జనసేన పవన్ తన ప్రసంగాల్లో జగన్ పై ఆయన పాలన విధానంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
జగన్ పాలన లో వైఫల్యాలను విడమరచి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో అధికార వైసీపీ ఇరకాటనికి లోనౌతోంది.
పవన్( Pawan kalyan ) విమర్శలకు ఎలా చెక్ పెట్టాలో అర్థంకాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఇటీవల వాలెంటరీ వ్యవస్థపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

వాలెంటర్లు( Volunteers ) డేటా చోరీకి పాల్పడుతున్నారని, ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించే హక్కు వాలెంటర్లకు ఎవరు అధికారం ఇచ్చారని, వాలెంటరీ వ్యవస్థకు ఎవరు బాస్ అంటూ తీవ్ర స్థాయిలో వాలెంటరీ వ్యవస్థపై పవన్ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు.నిజానికి ప్రజల వ్యక్తిగత డేటా సేకరించడం ముమ్మాటికి తప్పే అనేది అందరికీ తెలిసిన విషయమే.మరి అలాంటి డేటాను సర్వేలు అంటూ, కుటుంబ లెక్కలు అంటూ ఇలా ప్రతి చిన్న అంశానికి ప్రజల పూర్తి డేటా సేకరిస్తున్నారు వాలెంటర్లు.ఇలా సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తోందనేది పవన్ లేవనెత్తున్న ప్రశ్న.
దీనికి క్లారిటీ ఇవ్వాలంటూ పవన్ సిఎం జగన్( CM jagan ) ను సూటిగా ప్రశ్నిస్తున్నారు.

అయితే పవన్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు వైసీపీ నుంచి సరైన సమాధానం రాకపోగా.పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడమే పరిపాటిగా పెట్టుకున్నారు వైసీపీ నేతలు.స్వయంగా సిఎం జగన్ కూడా తాజాగా జరిగిన మంగళగిరి సభలో వాలెంటరీ వ్యవస్థపై పొగడ్తలు కురిపించారే తప్పా.
పవన్ చేసిన విమర్శలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.పైగా పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడం గమనార్హం.
సిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తనపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇవ్వకుండా తరచూ తరచూ పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం ఏంటని సామాన్యులు కూడా సిఎం జగన్ పై మండిపడుతున్నారు.మంగళగిరిలో సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన ఎంత ప్రస్టేషన్ లో ఉన్నారో అర్థమౌతోంది.
మొత్తానికి వాలెంటరీ వ్యవస్థపై పవన్ లేవనెత్తిన అంశాలతో జగన్ డిఫెన్స్ లో పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.