మీరు రాజధాని చేయడమేంట్రా బాబు .. ! మెగా బ్రదర్ వైరల్ కామెంట్స్

నిన్న విశాఖలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న గలాట గురించి అందరికీ తెలిసిందే.నిన్న పవన్ విశాఖలో అడుగుపెట్టారు.

 Pawan Kalyan Brother Naga Babu Sensational Tweet Vizag Capital,pawan Kalyan,ap C-TeluguStop.com

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ విశాఖ గర్జన నిర్వహించిన రోజే పవన్ సైతం జనవాణి కార్యక్రమం పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.పవన్ ఎయిర్ పోర్ట్ లో కాలుపెట్టే సరికే వైసీపీ మంత్రుల పై జనసేన కార్యకర్తలు తమ ప్రతాపం చూపించారు.

ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే వైసిపి మంత్రులు విశాఖ గర్జన సభలో టిడిపి తో పాటు, జనసేన పైన విమర్శలు చేశారు.ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నాయకుడైన నాగబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జన సభ పై ఆయన వ్యంగంగా విమర్శలు చేశారు.  వైజాగ్ మీరు రాజధాని చేయడం ఏంట్రా బాబు.! వైజాగ్ ఆల్రెడీ రాజధాని ,అమ్మ మొగుడు లాంటి సిటీ .వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చేయమని గర్జించండి.అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.ఇక ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ నిర్వహించి జనవరి కార్యక్రమంలోని పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను స్వీకరించనున్నారు.అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించబోతున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Nagababu, Pawan Kalyan, Vizag, Ysrcp-Political

ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించనున్నారు.అయితే పవన్ విశాఖ పర్యటన వెనుక టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే పవన్ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జన సభకు మైలేజ్ రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే పవన్ ఈ టూర్ ఏర్పాటు చేసుకున్నారని వైసీపీ విమర్శలు చేస్తోంది.ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్స్  వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube