పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రలో నటించిన బ్రో చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది.తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ్య సీతమ్ కి బ్రో చిత్రం రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కేవలం 25 నుండి 30 రోజుల సమయం మాత్రమే కేటాయించాడు.ఇక ప్రమోషన్( Movie Promotion) కార్యక్రమాల కోసం మరో నాలుగు ఐదు రోజులు పవన్ కళ్యాణ్ కేటాయిస్తాడని అంతా భావించారు.
కానీ బ్రో చిత్రం( BRO Movie ) ప్రమోషన్ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ హాజరవుతాడా అంటే అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది.
జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నాడు.యాత్ర మొదలయితే ఆయన సినిమాలకు కాస్త దూరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.కనుక బ్రో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతాడా లేదా అనే అనుమానాలు ఇప్పటి నుండే మొదలయ్యాయి.పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ యొక్క ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉంటాయని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలేలా ఉంది.
అయితే జనసేన పార్టీ కోసం ఆయన చేయబోతున్న వారాహి యాత్ర( Varahi Yatra ) అత్యంత కీలకంగా మారబోతోంది అంటూ అభిమానులు మరియు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్ ఈసారి తప్పకుండా తాను విజయం సాధించడంతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకుంటారని అంతా నమ్మకంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఈ సారి కింగ్ అవ్వడం ఖాయం లేదా కింగ్ మేకర్ అవడం ఖాయం అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు అభిప్రాయం చేస్తున్నారు.అందుకోసం సినిమాలను కాస్త పక్కకు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా వారు భావిస్తున్నారు.పవన్ బ్రో ప్రమోషనల్ ఈవెంట్స్ లో మాత్రమే కాకుండా హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంది.