యూఎస్ లో భీమ్లా నాయక్‌ 500.. అరుదైన రికార్డ్‌ ఆన్ ది వే

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫామ్ అయ్యింది.

గత సంవత్సర కాలంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అదిగో ఇదిగో అంటూ వాయిదా వేశారు.కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అయింది.

ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధం చేశారు.ఏపీలో టికెట్ రేట్ల విషయంలో నెలకొన్న సందిగ్ధ కారణంగా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.

కానీ టికెట్ల రేట్లు విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.కనుక విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అందుకే ఈ నెల 25వ తారీకున సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.అమెరికాలో ఈ సినిమాను ఏకంగా 500లకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

ఈ సంఖ్య మరో 100 నుండి 150 పెరిగినా ఆశ్చర్యం లేదు.పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి.

త్రివిక్రమ్ స్క్రిప్ట్ మరియు రచనా సహకారం అందించడం వల్ల ఖచ్చితంగా సినిమా ఆ స్థాయిలోనే ఉంటుందని నమ్మకం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది.సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యూఎస్ లో అత్యధిక వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు భారీ క్రేజ్‌ నేపథ్యంలో అక్కడ భారీగా ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.ప్రీమియర్ తో మిలియన్ డాలర్లను లాంగ్ రన్ లో మరో రెండు మిలియన్ల డాలర్లను దక్కించుకుంటే మొత్తంగా మూడు మిలియన్ డాలర్లతో భీమ్లా నాయక్ ఎక్కడ పెద్ద సినిమాగా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్‌ నటించగా రానా కీలక పాత్రలో నటించాడు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే.రీమేక్ అయినా కూడా పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మరియు స్క్రీన్‌ ప్లే మార్చారని సమాచారం అందుతోంది.తమన్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.

Advertisement

ఆయన అందించిన పాటలు ఇప్పటికే సినిమా ప్రేక్షకులపై ఆసక్తి వ్యక్తం అయ్యేలా చేసింది.

తాజా వార్తలు