పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు తిరుపతి ఉప ఎన్నికల విషయమై పర్యటించడంతో పాటు జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు మృతిపై ఆందోళనలో పాల్గొన్నాడు.ఆ కుటుంబంను పరామర్శించడంతో పాటు పోలీసుల వద్దకు కూడా వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఇప్పుడు హీరోగా మారిపోయాడు.నిన్నటికి నిన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో కలిసి మాట్లాడి తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఒక నిర్ణయం కు వచ్చేందుకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ పనిలో పడ్డాడు.
పవన్ తో పాటు రానా కూడా నేటి నుండి షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లో పవన్ తో పాటు రానా నటించడం వల్ల ఇదో భారీ మల్టీ స్టారర్ సినిమా గా ఇండస్ట్రీ వర్గాల వారు ప్రచారం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను రానా మరియు పవన్ లపై చిత్రీకరిస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారు.మార్చి వరకు పూర్తి చేయడంతో పాటు సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఇదే కనుక నిజం అయితే వకీల్ సాబ్ కు ఈ సినిమాకు కొన్ని వారాల తేడా మాత్రమే ఉంటుంది.అభిమానులకు పండుగే పండుగ.
తిరుపతి ఉప ఎన్నికల వరకు ఈ రీమేక్ పని పూర్తి చేయాలనేది పవన్ అభిప్రాయం.