పవన్‌ చేస్తున్న సినిమాలన్నీ ప్రసాద్ ల్యాబ్స్ మూలకి వెళ్లినట్లేనా..?

పవన్‌ కళ్యాణ్‌( Pawan Kalyan ) మొదలు పెట్టిన సినిమాలన్నీ కూడా సందిగ్ధంలో పడ్డట్లు అయ్యింది.హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా లు షూటింగ్ వివిధ దశల్లో ఉన్నాయి.

 Pawan Kalyan And His Movies Going To Prasad Lab , Pawan Kalyan , Politics, Jan-TeluguStop.com

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాలతో బిజీ అవ్వడంతో చాలా వరకు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కోట్ల రూపాయలు నిర్మాతలతో పెట్టించి సినిమా లను పూర్తి చేయకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

హరి హర వీరమల్లు సినిమా ను మొదలు పెట్టి రెండేళ్లకు పైగా అయింది.క్రిష్ వంటి ప్రతిభావంతుడు అయిన దర్శకుడి సమయం చాలా వృదా చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

అంతే కాకుండా హరీష్ శంకర్ ఇప్పటి వరకు రెండు సినిమా లు చేసే వాడు.ఉస్తాద్‌ భగత్ సిం( Ustaad Bhagat Singh )గ్ అని ఆయన సమయం వృదా చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Harihara, Jana Sena, Pawan Kalyan, Prasad Lab, Tollywood, Ustaadbhagat-Mo

ఇక సాహో సుజీత్‌ దర్శక్వంలో కూడా ఒక సినిమాను చేయాలని భావించిన పవన్ ఓజీ( OG MOVIE ) ని మొదలు పెట్టాడు.ఆ సినిమా కూడా పక్కకు పోయింది.తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి.ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు అవ్వబోతున్న విషయం తెల్సిందే.

Telugu Harihara, Jana Sena, Pawan Kalyan, Prasad Lab, Tollywood, Ustaadbhagat-Mo

ఈ నేపథ్యం లో పవన్ ఇక షూటింగ్స్ కి హాజరు అవుతాడా అంటే కచ్చితంగా లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.వాస్తవానికి కూడా పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు సినిమా ల్లో నటిస్తూ ఉంటే ఆయన సొంతం పార్టీ కార్యకర్తలు కూడా చీ కొట్టే అవకాశాలు ఉంటాయి.ఆరు నెలల సమయం కూడా లేదు.ఇలాంటి సమయంలో షూటింగ్స్ అంటూ బిజీ గా ఉండటం ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.అందుకే పవన్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రసాద్‌ ల్యాగ్స్ లో అటకెక్కాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube