పవన్ కళ్యాణ్ మాట ఇస్తే అంతే.ఎంత మంది చెప్పిన వినరు.
అయన నమ్మింది గట్టిగా చేయడానికే ప్రయత్నిస్తారు.అందుకే అయన పవన్ కళ్యాణ్ అయ్యారు… కాదు కాదు పవర్ స్టార్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ 2008 లో జల్సా సినిమా ద్వారా మంచి సాలిడ్ హిట్ అందుకున్నారు.ఆ తర్వాత వరస పరాజయాలు మాత్రమే పలకరించాయి.
తీన్మార్, పులి, పంజా సినిమాలు చేసిన కూడా నాలుగు ఏళ్ళ పాటు ఆయనకు ఎలాంటి విజయం దక్కలేదు.దాంతో హరీష్ శంకర్ దర్శకత్వం లో మంచి మాస్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.అదే గబ్బర్ సింగ్.
2012 లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది.అయితే అంతకు ముందు వరకు ఉన్న పరాజయాలను దృష్టిలో పెట్టుకొని గబ్బర్ సింగ్ చిత్రం కోసం ఆచి తూచి అడుగు వేయాలని చిత్ర బృందం అనుకుంది.అందుకే ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాల కసరత్తు చేయాలనీ భావించారు.
కానీ అంతకు ముందు పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కి తన తదుపరి సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటాను అని మాట ఇవ్వడం తో ఆమెనే కంఫర్మ్ చేసారు.

అయితే అప్పటికే శృతి హాసన్ కి బీభత్సమైన ఫ్లాప్ సినిమాలు ఉన్నాయ్.ఆమెను ఐరెన్ లెగ్ అని కూడా పిలవడం మొదలు పెట్టారు.అందరు శృతి హాసన్ ని హీరోయిన్ గా వద్దని చెప్పిన అయన వినలేదు.
ఒక రోజు షూటింగ్ జరుగుతుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి శృతి హాసన్ కి ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయ్ ఆమె హీరోయిన్ గా వద్దు మార్చేద్దాం అని అడిగారట.

దానికి పవన్ కళ్యాణ్ నువ్వు అన్ని హిట్ సినిమాలే తీసావా అప్పుడు నీతో నేను చేయడం లేదా అంటూ చెప్పడం తో అక్కడి నుంచి బండ్ల వెళ్లిపోయారట.ఇదే విషయం పై దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ సినిమా క్యాస్ట్ అన్నౌన్స్ చేసిన రోజు నుంచి ఒక వెయ్యి మందికి పైగా ఎందుకు ఈ అమ్మాయి ని హీరోయిన్ గా పెట్టుకున్నారని, ఇప్పటికి ఏం మించి పోలేదు మార్చేయండి అని చెప్పారట.ఎంత మంది చెప్పిన పవన్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి గబ్బర్ సింగ్ సినిమా తీశారు.
ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ.