హీరోయిన్స్ కేవలం తమ జీవితాన్ని సినిమాల వరకే అంకితం చేయాలని అనుకుంటారు.అలా పెళ్లి చేసుకోకుండా తమ మొత్తం జీవితాన్ని సినీ ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉంటారు.
కానీ కొంతమంది హీరోయిన్స్ అలా కాదు.జీవితంలో పెళ్లి కూడా ఒక ముఖ్యమైన ఘట్టమని జీవితంలో అన్నీ సాధించాలి అని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మళ్లీ సినిమాలలో కూడా నటించాలని అనుకుంటారు.
ఇక ఈ మధ్య చాలామంది హీరోయిన్స్ పెళ్లి చేసుకొని పిల్లలను కని మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు.అలా తమ జీవితం కేవలం సినిమాలకే కాకుండా వ్యక్తిగతంగా కూడా ముఖ్యమే అని భావిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్లలు కన్న హీరోయిన్లలో కాజల్, ప్రణీత, నయనతార ఇలా పలువురు హీరోయిన్స్ ఉన్నారు.అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తన అమ్మతనాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఒక పోస్ట్ షేర్ చేసింది.
ఇంతకూ తను ఏం పోస్ట్ చేసిందో చూద్దాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ ఎంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో చూసాం.
తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.ఇక నటన పరంగా మాత్రం మంచి మార్కులు సొంతం చేసుకొని స్టార్ హీరోల సరసన కూడా నటించింది.
ఈ ముద్దుగుమ్మ తన జీవితాన్ని కేవలం సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా అంకితం చేసింది.ప్రేమించి పెళ్లి చేసుకొని మంచి కోడలుగా అడుగుపెట్టింది కాజల్.

అంతేకాకుండా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అందరి దృష్టిలో మంచితనాన్ని సంపాదించుకుంది.ఇక తన నటన కెరీర్ ని కూడా వదలకుండా మళ్లీ రీఎంట్రీ తో బిజీగా ఉంది ఈ బ్యూటీ.అలా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.వ్యక్తిగతంగా మంచి భార్యగా, మంచి తల్లిగా కూడా బాధ్యతలు చేపడుతుంది కాజల్.

ఇక సోషల్ మీడియాలో చూస్తే తన లైఫ్ ఏంటో అర్థం అవుతుంది.ప్రతిరోజు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కనిపిస్తుంది కాజల్.తన భర్తతో దిగిన ఫోటోలను, తన బాబుతో దిగిన ఫోటోలను పంచుకుంటూ అందరి దృష్టిలో పడుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన కొడుకుని చూసి బాగా మురిసిపోయింది కాజల్.
తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తన బాబు, భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కలిపి వీడియో లాగా షేర్ చేసుకుంది.
అందులో తన బాబు కాస్త ఎదగటంతో అది చూసి మురిసిపోయింది కాజల్.అంతేకాకుండా తన బాబు ఎదిగిపోయాడు అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.ఇక ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవ్వటంతో.తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా తమ అభిమాన హీరోయిన్ హ్యాపీ లైఫ్ ని చూసి మురిసిపోతున్నారు.







