విశాఖ షిప్పింగ్ హార్బర్ లో దగ్దమైన బోట్ల యజమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ 30 లక్షల సహాయం!

రీసెంట్ సమయం లో విశాఖపట్నం షిప్పింగ్ బోర్డు( Visakhapatnam Harbour ) లో ఏకంగా 60 బోట్లు దగ్ధం అవ్వడం ఎంత పెద్ద సేసెన్షనల్ టాపిక్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఈ దుర్ఘటన లో దాదాపుగా 40 కోట్ల రూపాయిల వరకు ఆర్థిక నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

 Pawan Kalyan 30 Lakh Help To The Families Of The Owners Of The Boats That Were-TeluguStop.com

ప్రముఖ యూట్యూబర్ నాని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, నాని పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అంటూ సోషల్ మీడియా లో వైసీపీ మీడియా విష ప్రచారం చేసింది.సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తల ఆధారంగా పోలీసులు నాని ని విచారణ చెయ్యగా, ఆయనకీ ఈ దుర్ఘటన కి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది.

మరోపక్క జనసేన పార్టీ కూడా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ తప్పుడు వార్త పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఖండించింది.వైసీపీ పై పరువు నష్టం దావా వేస్తాము అంటూ చెప్పుకొచ్చింది.

Telugu Janasena, Navy, Pawan Kalyan, Visakhapatnam-Telugu Political News

ఇదంతా పక్కన పెడితే ప్రభుత్వాలు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా తన సొంత కష్టార్జీతం తో సంపాదించిన డబ్బుల్ని ఇచ్చి సహాయ పడే గొప్ప మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్( Pawan kalyan ) మాత్రమే అని చెప్పొచ్చు.గత ఏడాది నుండి ఆయన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు చెరో లక్ష చొప్పున పంచుకుంటూ వచ్చాడు.దేశ రాజకీయ చరిత్ర లో అధికారం లోకి వస్తే మీకు న్యాయం చేస్తాము అని చెప్పిన వాళ్ళే కానీ, తమ జోబుల్లో నుంచి డబ్బులు తియ్యడానికి ఒక్కరికి కూడా మనసు అంగీకరించలేదు.ఒక్క పవన్ కళ్యాణ్ కి తప్ప.అలా కౌలు రైతులకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు హార్బర్ లో దగ్దమైన 60 బోట్లకు సంబంధించిన యజమానులకు సహాయం చెయ్యబోతున్నాడు.60 కుటుంబాలకు 30 లక్షల రూపాయిలు ఆయన అందించబోతున్నాడు.

Telugu Janasena, Navy, Pawan Kalyan, Visakhapatnam-Telugu Political News

అంటే ఒక్కో కుటుంబానికి 50 వేల రూపాయిలు అన్నమాట.జరిగిన నష్టానికి పవన్ కళ్యాణ్ మొత్తం సహాయం చెయ్యలేడు, పాపం అంత ఆర్ధిక స్థితి కూడా ఆయనకీ లేదు, కానీ మీకు మేము ఉన్నాము అనే భరోసా ని ఇచ్చాడు.అంతే కాదు ప్రభుత్వం చేత ముక్కు పిండిమరీ నష్ట పరిహారం కూడా అందించే సత్తా పవన్ కళ్యాణ్ కి ఉందని జనాలు బలంగా నమ్ముతున్నారు.పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

దైవం మనుష్య రూపేణా అనే పదానికి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సార్థకత చేస్తూనే ఉన్నాడు.ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జనాలు ఆయన్ని రాజకీయ పరంగా ఉన్నత స్థాయిలో పెడుతారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube