నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో.గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నారు.
మహా మహులను షోకు తీసుకుని వచ్చి.
తనదైన శైలితో మన్ననలు పొందుతున్నారు.
ఏకంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని షోకి తీసుకుని వచ్చి.ఆయన మనోగతాన్ని ప్రజలతో పంచుకునేలా చేశారు.
అంతే కాకుండా.ఆయన ఎన్టీఆర్ కు ద్రోహం చేయలేదంటూ.
అది పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిపోయిందని చెప్పించారు.చంద్రబాబు సైతం తన ప్రచారంలో అన్ స్టాపబుల్ షోలో అంతర్గతాన్ని పంచుకున్నానని.
అన్నారు.ఇలా అడపా దడపా.
నేతలను నాయకులను, సినిమా వాళ్లను షోకు తీసుకుని వచ్చి.బాలయ్య గ్రేట్ అనిపించుకున్నారు.
ఎప్పుడూ.బాలయ్య అంటే యాక్షన్, మాస్ హీరోనే అనుకునే వారందరికీ తనలోని రేండో యాంగిల్ ను పరిచయం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సైతం ఆహ్వానించి.జై బాలయ్య అనిపించుకున్నారు.
అయితే ఇప్పుడు బాలయ్య షో మరోసారి వార్తల్లో నిలుస్తోంది.సినిమాలు అంటేనే నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలీ అనుకునే వారికి మేమంతా ఒక్కటే అని తారక్ నిరూపిస్తే.
బాలయ్య కూడా అవునంటూ.పవన్ ను తన షోకు ఆహ్వానించారు.
ఇంత వరకూ ఎలా ఉన్నా.ఇక్కడే మరో విమర్శ మొదలయింది.చంద్రబాబుతో ఎన్టీఆర్ గురించి.
తన పర్సనల్ లైఫ్ గురించి.ప్రజల్లోకి సానుకూలంగా తీసుకెళ్లిన బాలయ్యా.
అదే పనిని పవన్ విషయంలోనూ చేయాలని చూస్తున్నారు.ఆయన పర్సనల్ లైఫ్ పై ఇటీవల కాలంలో.
వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటంతో.వాటికి అన్ స్టాపబుల్ తో ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు.
ఇక అక్కడ సేనాని సక్సెస్ అయితే.దాన్ని ఆయుధంగా వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి పనికి వస్తుందని జనసేనికులు భావిస్తున్నారు.
మరి నిజంగా పవన్ అంతర్మథనాన్ని.అంతర్గతాన్ని బాలయ్యా సాఫ్ట్ గా చూపిస్తారా.? లేక మరో వివాదంలో చిక్కుకుని సేనానిని ఇరికిస్తారా చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy