ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వ్యక్తి పవన్..: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం అవినీతి కోసమే చంద్రబాబు పని చేశారని ఆరోపించారు.12 ఏళ్ల పాలనలో ప్రజల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని మండిపడ్డారు.

 Pawan Is A Person Who Sacrifices For Packages..: Cm Jagan-TeluguStop.com

చంద్రబాబుకు కేవలం దోచుకోవడం.

పంచుకోవడం మాత్రమే తెలుసని సీఎం జగన్ విమర్శించారు.ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడు లేదని చెప్పారు.

అలాగే చంద్రబాబు మరోసారి సీఎం కావాలనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని పేర్కొన్నారు.అయితే దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారన్నారు.

దత్తపుత్రుడి నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందన్న సీఎం జగన్ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎన్నడూ చూడలేదని తెలిపారు.ప్యాకేజీ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువుగా చూస్తారని విమర్శించారు.

అటువంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube