పవర్ స్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఏ స్థాయిలో అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాజాగా దర్శకుడు శివ నిర్వాణను టార్గెట్ చేయడంతో పాటు ఆ దర్శకుడికి చుక్కలు చూపించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా దర్శకునిగా శివ నిర్వాణకు మంచి పేరు ఉంది.నిన్ను కోరి, మజిలీ సినిమాలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న ఈ దర్శకుడికి టక్ జగదీష్ సినిమాతో ఫ్లాప్ ఖాతాలో చేరింది.
అయితే ఈ సినిమా ఫ్లాపైనా విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ఖుషి టైటిల్ తో ఈ దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.
అయితే విజయ్ సమంత కాంబో మూవీకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేయడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఈ దర్శకుడు తమ్ముడు సినిమాలోని మేడిన్ ఆంధ్రా సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే ఈ వీడియోను చూసిన పవన్ ఫ్యాన్స్ శివ నిర్వాణను దారుణంగా ట్రోల్స్ చేశారు.మొదట పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ ను ఖుషి మూవీకి ఫిక్స్ చేయకుండా ఉంటే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు విజయ్ ఖుషి మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.సమంత షూట్ లో పాల్గొంటే మాత్రమే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.
ఖుషి మూవీ సక్సెస్ సాధిస్తే శివ నిర్వాణకు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయని చెప్పవచ్చు.లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా సమంత ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
సమంత ఒక్కో ప్రాజెక్ట్ కు 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్య