నేడు జనసేన లో కీలక పరిణామం .. ప్రతిపక్ష నేతగా పవన్ ? 

నేడు జనసేన పార్టీలో( Janasena party ) పరిణామం చోటు చేసుకోబోతోంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించడం, అలాగే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించడంతో , 100% జనసేన విజయాన్ని అందుకుంది.

 Pawan As The Leader Of The Opposition Is The Key Development In The Janasena Tod-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు.ఈ ఎంపిక ద్వారా పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనున్నట్లు సమాచారం.చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ చేరినప్పటికీ , ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయన పొందుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan-Politics

175 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో వైసిపి ( YCP )కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.దీంతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపికి మిత్రపక్షంగా ఉంటూనే ప్రతిపక్షపాత్ర కూడా పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒక ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.

అయితే పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే పెండింగ్ లో ఉండడంతో , ఉపముఖ్యమంత్రి అయినా తీసుకుంటారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.తెనాలి జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్( Janasena MLA Nadendla Manohar ) కు మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తంగా జనసేనకు రెండు మంత్రి పదవులు , బిజెపికి ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది .

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan-Politics

రేపు ఏపీ సీఎం గా చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనేది క్లారిటీ రానుంది.2019 ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది.దీంతో ఆ పార్టీ పని పూర్తిగా అయిపోయిందని అంతా భావించినా పవన్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని పదేపదే చెబుతూ టిడిపి తో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి అనుకున్న విధంగానే వైసిపిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు.అందుకే టిడిపి కూటమిలో జనసేనకు,  పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో ప్రాధాన్యం దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube