ఏపీలో టీడీపీ, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి అధికారంలోకి వచ్చేలా చేయడంతో పాటు, వైసిపి కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యేలా చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకం అయ్యారు.పవన్ అండ లేకపోతే తమ కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు ఒప్పుకున్నారంటే పవన్ పవర్ ఏమిటో అందరికీ అర్థం అయింది.
ఏది ఏదైతేనేం వైసీపీని ఓడించాలనే లక్ష్యాన్ని పవన్ చేరుకున్నారు.టిడిపి జనసేన,బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
రేపు ఏపీ సీఎం గా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా విస్తృతంగా జరుగుతోంది.
అయితే ఈ విషయంలో పవన్ సైలెంట్ గా ఉండడంతో, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.
పవన్( Pawan ) ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే విషయంలో ఇంకా ఆలోచనలోనే ఉన్నారట.దీనికి కారణం ఇప్పటికే కొన్ని సినిమాలకు పవన్ కమిట్మెంట్లు ఇవ్వడం, కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఉండడంతో, వాటిని ఆపేస్తే భారీగా నష్టం వస్తుందని, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాల్లో నటిస్తే విమర్శలు వస్తాయని ఆలోచిస్తున్నారట.ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో జనసేన, బిజెపి లకు మంత్రి పదవులు దక్కనున్నాయి.
జనసేన, బిజెపికి ఎన్నెన్ని మంత్రి పదవులు ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు.
అయితే పవన్ కు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారు.ప్రస్తుతం టిడిపి నుంచి గెలిచిన వారు ఎక్కువ మంది ఉండడం, సీనియర్ నేతలు చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోవడంతో, బిజెపికి ఒకటి, జనసేనకు రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.