బాబు ' లెక్క ' పై పవన్ గుస్సా ! టీడీపీ జనసేన పొత్తు కష్టమేనా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిన్న జరిగిన కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పవన్ ఆవేశంగా ప్రసంగించారు.అనేక రాజకీయ అంశాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

 Pawan Angry On Babu 'lekka'! Is Tdp Jana Sena Alliance Difficult, Pawan Kalyan,-TeluguStop.com

జనసేన(Janasena) రాబోయే రోజుల్లో ఏవిధంగా ముందుకు వెళ్ళబోతుందనే విషయాలు పైన మాట్లాడారు.ముఖ్యంగా టిడిపి,  జనసేన పొత్తుల అంశం పైన స్పందించారు.

అయితే గతంతో పోలిస్తే పవన్ చాలా భిన్నంగానే తన ప్రసంగాన్ని కొనసాగించారు.టిడిపి తో పొత్తు అంశం పైన పవన్ స్పందించారు.

తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల గురించి తనకు తెలియని కావని , తనతో మంచిగా ఉంటూ కేవలం 20 సీట్లకు మాత్రమే పరిమితం చేయాలన్న బలమైన మెసేజ్ లు ఆ పార్టీ ఇస్తుందని పవన్ అన్నారు.

Telugu Ap Cm Jagan, Ap Cm Pavan, Hariram Jogiya, Jagan, Janasena, Janasenatdp, P

జనసేన స్వతంత్రంగా ఉంటుందే తప్ప,  ఒకరి వద్ద ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టబోనని పవన్ అన్నారు.తనపై వెయ్యి కోట్ల ప్యాకేజీ అంటూ ప్రచారం మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా.

ఇంకా అనుకూల పవనాలు రాలేదన్నారు.తాను వేరే పార్టీ అజెండాను మోయలేను అంటూ టిడిపికి చురకలు అంటించారు.

పదివేల కోట్లున్న సంకల్పం లేకపోతే పార్టీని నడపలేమని,  లోపాయికారి ఒప్పందాలకు లొంగిపోను అంటూ టిడిపిని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.గతంలో మాదిరిగా అర కొర సీట్లతో తమతో పొత్తు పెట్టుకుంటామంటే కుదిరే పని కాదు అంటూ టిడిపి ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పదవి ఇస్తే చంద్రబాబుతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని,  కోరుకున్న స్థానాలన్నీ పొత్తులో భాగంగా ఇవ్వాల్సిందే అని పవన్ సంకేతాలు పంపించారు.అలా అయితేనే పొత్తు ఉంటుందని , లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పారు.

Telugu Ap Cm Jagan, Ap Cm Pavan, Hariram Jogiya, Jagan, Janasena, Janasenatdp, P

 ఇక కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య(Hari Rama Jogaiah) కూడా టిడిపి పై తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు.జగన్ పోవాలి పవన్ రావాలి అన్నదే కాపు సంక్షేమ సేన లక్ష్యమని జోగయ్య అన్నారు.జనసేన ను బలహీనపరచాలని చంద్రబాబు చూస్తున్నారని,  అందుకే కన్నా లక్ష్మీనారాయణ,  మహాసేన రాజేష్ లను జనసేనలో చేరకుండా చంద్రబాబు(Chandrababu) అడ్డుకున్నారంటూ జోగయ్య విమర్శలు చేశారు.కేవలం 20 సీట్లకే జనసేన ను పరిమితం చేసి,  తాను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ జోగయ్య మండిపడ్డారు.

నిన్న జరిగిన కాపు సంక్షేమ సేన సమావేశంలో టీడీపీ తో పొత్తు విషయమే బలమైన సంకేతాలను పంపించారు.అరకొర సీట్ల తో జనసేన తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న చంద్రబాబు కు పరోక్షంగా గట్టి వార్నింగే పవన్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube