పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) పరిచయం అవసరం లేని పేరు కన్నడ తెలుగు భాషలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం నటుడు నరేష్( Naresh ) తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక వీరిద్దరి రిలేషన్ కారణంగా రమ్య రఘుపతి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇక పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉండటమే కాకుండా వీరిద్దరూ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు.ఈ సినిమా విడుదల సమయంలో వీరిద్దరూ భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ వార్తల్లో నిలిచారు.

ఇకపోతే మే 30వ తేదీ ఈమె కన్నడ యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ పరీక్ష( PhD Entrance Exam ) రాసిన విషయం మనకు తెలిసిందే.స్వయంగా నరేష్ దగ్గరుండి ఆమె చేత ఈ పిహెచ్డి ప్రవేశ పరీక్షను రాయించారు.కన్నడ భాషలో పిహెచ్డి చేయాలనుకుంటున్నానని తెలియజేశారు.ఈ క్రమంలోనే మే నెలలో పిహెచ్డి ప్రవేశ పరీక్ష రాసినటువంటి పవిత్ర లోకేష్ ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని తెలుస్తుంది.
తాజాగా ఈ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేయగా ఇందులో పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించడం విశేషం.

పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను సుమారు 981 మంది అభ్యర్థులు పరీక్ష రాయిగా 259 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని కన్నడ యూనివర్సిటీ ఛాన్స్లర్ వెల్లడించారు.ఈ ఉత్తీర్ణత జాబితాలో పవిత్ర లోకేష్ ఉండటం విశేషం.కన్నడ భాషలో పీహెచ్డీ చేయాలని కోరిక తనకి ఉంది అంటూ గతంలో పవిత్ర లోకేష్ తెలియజేశారు.
ఇందులో భాగంగానే భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్టెన్షన్ సెంటర్లో పరిశోధన చేయడం కోసమే పవిత్ర లోకేష్ ఈ ప్రవేశ పరీక్ష రాశారు.అయితే ఇందులో ఉత్తీర్ణత సాధించడంతో ఈమె త్వరలోనే ఈ పిహెచ్డి కూడా పూర్తి చేయబోతున్నారని తెలుస్తుంది.
అయితే మెరిట్ లిస్ట్ ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించారన్న విషయం తెలియడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.