బీజేపీ .. సైనికులు టీడీపీ ? తిరుపతి సిత్రాలెన్నో ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నాయకులు అకస్మాత్తుగా అక్కడి నుంచి బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని బిజెపి ప్రకటించగానే, దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మద్దతు పలికారు.

బీజేపీకి మద్దతు ఇస్తున్నామని , పోటీలో నిలవడం లేదు అంటూ ప్రకటించేశారు.దీంతో పవన్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని , జనసేన అభ్యర్థి అక్కడ పోటీకి దిగితే, జనసేన కు  పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన మాదిరి గా తిరుపతిలోనూ కొనసాగేది అని, సొంత పార్టీ నాయకుల నుంచే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే పార్టీ అంతర్గతంగా బలపడేందుకు, రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత బలోపేతం అయ్యేందుకు ఈ నిర్ణయం సరైనదేనని జనసైనికులు అందరూ అర్థం చేసుకొని, బిజెపి అభ్యర్థి కి తిరుపతిలో మద్దతు పలకాలని ప్రకటించారు.అయితే జనసైనికులు మాత్రం బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే కంటే, అక్కడ టిడిపి అభ్యర్థికి మద్దతు పలకడం మంచిదనే నిర్ణయానికి వచ్చారట.

ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో లోపాయికారి టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించగలిగామని, ఇప్పుడు అదే ఫార్ములా తిరుపతి ఉప ఎన్నికలలో ను ఉపయోగించి సక్సెస్ అవ్వాలని, టిడిపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని, బీజేపీని దూరం పెట్టాలని అనుకుంటున్నారట.మొదటి నుంచి జనసేన విషయంలో బిజెపి అనుమానాస్పదంగానే కాకుండా , అవమానిస్తూ వస్తుండడం పవన్ కు సైతం అపాయింట్మెంట్ ఇవ్వక పోవడం ఎలా ఎన్నో కారణాలు జనసైనికులు గుర్తు చేసుకుంటూ టిడిపికి మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట.

Advertisement

అటు పవన్ బిజెపి వైపు చూస్తుండగా జనసైనికులు మాత్రం టిడిపి వైపు చూస్తూ ఉండడం తో తిరుపతి ఎన్నికలలో ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు