జనసేన( Janasena ) వేస్తున్న అడుగులు చూస్తుంటే సమాధానం అవుననే వస్తుంది.మాజీ పప్రదాని దేవగౌడ కుమారుడైన కుమారస్వామి( Kumaraswamy ) ఇప్పటివరకు రెండు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు .
ముఖ్య మంత్రిగా పూర్తి కాలం కొనసాగలేక పోయినప్పటికీ ఆయన గెలిచిన సీట్ల కు ఆయనముఖ్య మంత్రి పదవి దక్కడం గొప్పనే చెప్పాలి దానికి కారణం అక్కడ హాంగ్ వాతావరణం ఏర్పడడం .అక్కడ కాంగ్రెస్ భాజాపాలు వ్యక్తిగతంగా ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ రెండు పార్టీలు బద్ద శత్రువులైన కారణాన్న మధ్యలో కుమారస్వామి ని ముఖ్యమంత్రిగా చేశారు.ఇప్పుడు అదే వాతావరణంఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు వ్యక్తిగతంగా అధిక సీట్లను గెలుచుకున్నప్పటికీ కచ్చితంగా హంగు పరిస్థితి వస్తుందని అప్పుడు జనసేన పార్టీ గెలిచే సీట్లు కీలకంగా మారతాయని, వైసీపీ( YCP ) మళ్ళీ అదికారం లోకి రాకుండా చేయాలని బావించే తెలుగు దేశం పార్టీ తమ నాయకుడ్ని ముఖ్యమంత్రిగా చేసే ఒప్పందం మీద జనసేన తెలుగుదేశం కలుస్తాయని, తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం ముఖ్యమంత్రి స్థానాన్ని పవన్ కళ్యాణ్( Pavan klayan ) కి ఇస్తుందంటూ జనసెన నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట.
జనసేన అధిష్టానం కూడా ఈ దిశగానే ఆలోచనలు చేస్తుందని , ప్రబుత్వ ఏర్పాటు లో కీలకం కావాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పూర్తిస్థాయి రాష్ట్రం మీద దృష్టి పెట్టి తమకున్న పరిమిత వనరులతో నెగ్గుకురావడం కష్టం అనే భావనలో ఆ పార్టీ ఉందని అందువల్ల తాము బలంగా ఉన్న సీట్లపై దృష్టి పెట్టి ఒక 30 ఎమ్మెల్యేలు గెలుచుకున్నా కూడా అది ఎన్నికలలో కీలకమవుతుంది అని పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేసుంది అని అందువల్ల పార్టీ బలం గా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని ఇక్కడ మెజారిటీ సీట్లను గెలుచుకునే విధంగా పావులు కదపాలని జనసేన అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం.మరి కర్ణాటక( Karnataka ) పరిస్థితులు ఇక్కడ పునరావృతం అయ్యి తమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని జనసైనికులు నమ్మకాలు ఏ మేరకు నిజమవుతాయో వేచి చూడాలి.