ఆనాడు సహాయ నిరాకరణ...నేడు ఆర్థిక నిరాకరణ

స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు దేశ ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.బ్రిటిషు పాలకులకు పన్నులు కట్టలేదు.

 Patels In Gujarat Withdrawing Money From Banks-TeluguStop.com

కార్యాలయాలకు వెళ్లలేదు.విద్యా సంస్థలకు వెళ్లలేదు.

ప్రభుత్వానికి ఏ సహాయమూ అందకుండా చూశారు.దీన్నే ‘నాన్‌ కోఆపరేషన్‌ మూవ్‌మెంట్‌’ అన్నారు.

ఇదొక నిరసన కార్యక్రమం.ప్రస్తుతం గుజరాత్‌లో రిజర్వేషన్లు కావాలని ఉద్యమం చేస్తున్న పటేల్‌ సామాజికవర్గం వారు ‘ఆర్థిక నిరాకరణ’ చేస్తున్నారు.

అంటే బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు తీసేసుకుంటున్నారు.అంటే విత్‌డ్రా చేస్తున్నారన్న మాట.వడ్దీ నష్టపోయిన బాధపడం.ఖాతర్‌ చేయం అంటున్నారు.

బ్యాంకుల నుంచి డిపాజిట్లు తీసుకుంటే ఆయా బ్యాంకులకే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టమే కదా.తమ సమస్య పరిష్కారం అయ్యేంతవరకూ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేయం అంటున్నారు.సహజంగానే పటేల్‌ సామాజిక వర్గం సంపన్నమైంది.వారి ప్రధాన వృత్తి వ్యాపారం.పరిశ్రమల నిర్వహణ మొదలైనవి.కాబట్టి బ్యాంకుల్లో లక్షల రూపాయలు డిపాజిట్‌ చేస్తారు.

ఇందులో ఫిక్సుడ్‌ డిపాజిట్లు కూడా ఉంటాయి.ఈ డిపాజిట్లు ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి.

కాని ఇప్పుడు వేలాదిమంది పటేల్‌ సామాజిక వర్గం వారు బ్యాంకుల నుంచి డిపాజిట్లు విత్‌ డ్రా చేస్తుండటంతో బ్యాంకుల యాజమాన్యాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.డబ్బు విత్‌ డ్రా చేసే ఉద్యమం దేశంలో ఇదే ప్రథమం కావొచ్చు.

అరవై లక్షల గుజరాత్‌ జనాభాలో పటేళ్ల జనాభా పద్నాలుగు శాతం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube