ట్రైన్‌ బోగిలో కుక్క కోసమే 2 సీట్లు కల్పించిన ప్యాసింజర్లు.. వీడియో వైరల్..

ఇంటర్నెట్‌లో ఎన్నో క్యూట్ యానిమల్ వీడియోలు రోజూ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి.వాటిలో కొన్ని మాత్రం ముఖంపై చిరునవ్వును తెప్పిస్తాయి.

 Passengers Who Provided 2 Seats For Dog In The Train Compartment Video Viral ,vi-TeluguStop.com

వాటిని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది కూడా.అలాంటి ఒక వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.

మీరు అందమైన జంతు వీడియోలకు అభిమాని అయితే.ఈ వీడియో మీకు తప్పక నచ్చుతుంది.

సాధారణంగా ఏ దేశంలోనైనా ట్రైన్‌లో ఎక్కువ మంది జనాలు ఉంటారు.ప్రయాణికులు అధికంగా ఉన్నప్పుడు ట్రైన్‌లో సీట్ దొరకడం చాలా కష్టం.

అయితే ఒక ట్రైన్‌లో ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉన్నా ఒక కుక్కకి మాత్రం రెండు సీట్లు దొరికాయి.అది హాయిగా ఇందులో నిద్ర పోయింది.

అదేంటి మనుషులకే సీట్లు లేనప్పుడు కుక్కకి ఎలా సీట్ దొరుకుతుంది అనే కదా మీ ప్రశ్న.నిజానికి ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు మంచి హృదయంతో ఆ కుక్కకి రెండు సీట్లు కేటాయించారు.

దాంతో అది వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందులో హాయిగా బజ్జుంది.ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉన్న ఈ బోగిలో రెండు ఖాళీ సీట్లను ఓ కుక్క ఆక్రమించు కోగా.

ఈ దృశ్యాలను కొందరు వీడియో తీశారు.ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో సీటులో కాకుండా చాలామంది ప్రయాణికులు నిలబడి ఉండటం కనిపించింది.అయినా కూడా రెండు సీట్లలో నిద్రిస్తున్న కుక్కను ఎవరూ అక్కడి నుంచి కదపలేదు.ఈ వీడియోను స్టెఫానో ఎస్ మాగీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.దీనికి 45,000 వరకు వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube